నిన్న ఏకంగా ఎనిమిది సినిమాల పోటీ ఉన్నప్పటికీ కేవలం తన మీద మాత్రమే దృష్టి పడేలా చేసుకున్న నితిన్ చెక్ డీసెంట్ గా ఓపెన్ అయ్యింది. చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ నిర్మించిన ఈ స్పోర్ట్స్ థ్రిల్లర్ మీద పబ్లిక్ టాక్ ప్లస్ రివ్యూస్ యావరేజ్ గానే ఉన్నప్పటికీ మొదటి రోజు మాత్రం చెప్పుకోదగ్గ వసూళ్లే వచ్చాయి. అయితే ఇది ఇటు కమర్షియల్ ఎంటర్ టైనర్ కాక అటు మాస్ ని టార్గెట్ చేసిన మసాలా మూవీ కాక మధ్యలో నిలిచిపోవడంతో దాని ప్రభావం కలెక్షన్ మీద పడింది. అందులోనూ ఏ సెంటర్స్ లో టికెట్ ధరలను పెంచుకునే సౌలభ్యం ఉండటం హౌస్ ఫుల్ బోర్డులు పడకుండా అడ్డుకుంది.
మొత్తానికి చెక్ అంచనాలు అందుకోనప్పటికీ సుమారు 3 కోట్ల 38 లక్షల షేర్ తో ఓకే అనిపించుకుంది. గ్రాస్ రూపంలో చూసుకుంటే ఈ మొత్తం 5 కోట్ల 34 లక్షల దాకా తేలుతుంది. ఇది ట్రేడ్ నుంచి వచ్చిన ధృవీకృత సమాచారం కానప్పటికీ ఇంచుమించు ఫిగర్స్ దగ్గరగా ఉంటాయి. నాంది తరహాలో చెక్ కు పాజిటివ్ టాక్ రాకపోవడం కొంత ప్రతికూలత చూపిస్తోంది. ఈవెనింగ్ షోస్ బాగానే రద్దీ కనిపించినప్పటికీ ఇవాళ రేపు ఎలా పెర్ఫార్మ్ చేయబోతుందన్నది కీలకంగా మారింది. ఇక ఏరియాల వారీగా వసూళ్లు చూసుకుంటే కింది విధంగా ఉన్నాయి. నైజామ్ లోనే డామినేషన్ కనిపించింది
– ఏరియా వారీగా చెక్ మొదటి రోజు ఆంధ్ర తెలంగాణ కలెక్షన్స్
AREA | SHARE |
నైజాం | 1.46cr |
సీడెడ్ | 0.47cr |
ఉత్తరాంధ్ర | 0.34cr |
గుంటూరు | 0.574cr |
క్రిష్ణ | 0.21cr |
ఈస్ట్ గోదావరి | 0.14cr |
వెస్ట్ గోదావరి | 0.10cr |
నెల్లూరు | 0.086cr |
Total Ap/Tg | 3.38cr |
ఇప్పుడు ఈ రోజు రేపు చెక్ కు చాలా కీలకం. వీకెండ్ కాబట్టి ఎంత మేర రాబట్టుకుంటే అంత ఇప్పుడే తెచ్చేసుకోవాలి. వచ్చిన టాక్ ని బట్టి చూస్తే వీక్ డేస్ లో డ్రాప్ ఉండటం ఖాయం. మార్కెట్ లో నాంది మంచి రన్ లో ఉండగా ఉప్పెన ఇప్పటికీ ప్రభావం చూపిస్తోంది. చెక్ కు సూపర్ హిట్ టాక్ వచ్చి ఉంటే ఖచ్చితంగా అవి స్లో అయ్యేవి. ఇప్పుడా అవకాశాలు తగ్గాయి కాబట్టి బ్రేక్ ఈవెన్ చేరుకోవడం చెక్ కు అంత సులభం కాదు. ఇప్పుడీ ఫలితం వల్ల నితిన్ కు వచ్చిన ఇబ్బందేమీ లేదు కానీ బయ్యర్ల కోణంలో చూసుకుంటే ఇంకో మూడు నాలుగు రోజులు చెక్ బలంగా ఆడితే బ్రేక్ ఈవెన్ దాటొచ్చు. దీనికి సంబంధించిన క్లారిటీ సోమవారానికి వస్తుంది