Idream media
Idream media
ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అన్యాయాలు, అకృత్యాలు, అక్రమాలు, అప్రజాస్వామ్య విధానాలతో జరిగింది. అది ఎవరిని అడిగిన చెబుతారు. అందువల్లనే ప్రజలు చంద్రబాబు పాలన పట్ల విసుగుచెంది…చిత్తుగా ఓడించారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి చారిత్రాత్మక విజయాన్ని అంధించారు.
సాధారణంగా రాజకీయ నాయకులకు తాము అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని మాటలు..ప్రతిపక్షంలోకి వచ్చేసరికి మాట్లాడుతారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, చట్టబద్ధత వంటి ప్రగ్భాలు పలుకుతారు. అదే అధికారంలో ఉన్నప్పుడు వాటిని పట్టించుకోరు. ప్రతిపక్షాలను, నేతలను, ప్రజలను అప్రజాస్వామ్య విధానాలతో హింసించే చంద్రబాబు…ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అచ్చెన్నాయుడును అరెస్టు చేయడమే తప్పన్నట్లు చంద్రబాబు, ఆయన భజన బృందం, ఆయనకు వత్తాసు పలికే మీడియా నానాయాగీ చేస్తుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు ప్రజాస్వామ్యం, కక్ష సాధింప చర్యలు గురించి ఉదరగొడుతున్నారు. అచ్చెన్నాయుడును అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికే ప్రమాదమంటా..! ఆయన అనుయాయులను, అవినీతిపరులను అరెస్టు చేయడం వల్లే ప్రజాస్వామ్య మనుగడ ప్రమాదంలో పడినట్లు చంద్రబాబు పేర్కొంటున్నారు. ఇదెక్కడి సిద్ధాంతం..? అంటే దేశంలోని అవినీతిపరులను వదిలేయాలా చంద్రబాబుగారు..? అదేనా టిడిపి సిద్ధాంతం..?
అరెస్టులతో ప్రజాస్వామ్య మనుగడు ప్రమాదంలో పడిపోతుందని ఉదరగొడుతున్న చంద్రబాబు…నాడు ఏం చేశారు.? ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయించలేదా? మీరు రాష్ట్రంలో ఏ జిల్లాకి పర్యటనకు వెళ్లిన అక్కడ ప్రతిపక్షాలను ముందస్తుగానే అరెస్టు చేయించేవారుగా…అది మరిచిపోయారా..? ఆనాటి నియంతృత్వ విధానాలు కదా ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కానీ ఆనాడు ఎప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడలేదే..ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా..? ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కొన్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా..? ప్రతిపక్ష పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా.? చంద్రబాబుగారూ..!
ఇక ప్రత్యర్థులపై కక్ష సాధించడం అన్నది ఫ్యాక్షనిస్టుల స్వభావమని చంద్రబాబు సెలవిచ్చారు. చంద్రబాబు అన్నట్లే ప్రత్యర్థులపై కక్ష సాధించడం ఫ్యాక్షనిస్టు స్వభావమైతే…చంద్రబాబు కూడా ఫ్యాక్షనిస్టే అవుతారు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థులపై చంద్రబాబు కక్షసాధింపు చర్యలు చేపట్టారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల జాతీయ నేతలపైన కూడా దాడి చేయించిన చంద్రబాబు ఈ రోజు మాట్లాడం చూస్తుంటే…తాము చేస్తే సంసారం…వేరెవ్వరైనా చేస్తే అదేదో అన్నట్లు ఉంది.