iDreamPost
android-app
ios-app

Ys jagan – ప్రతిపక్షం లాజిక్ లెస్ విమర్శలు.. గాలి తీసేస్తూ జగన్ భేష్ అంటూ కేంద్ర బృందం ప్రశంసలు..

Ys jagan – ప్రతిపక్షం లాజిక్ లెస్ విమర్శలు.. గాలి తీసేస్తూ జగన్ భేష్ అంటూ కేంద్ర బృందం ప్రశంసలు..

ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సంభవించిన వరద నష్టం గురించి అధ్యయనం చేసేందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ బృందం వరద ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన వివరాలు అధికారులు సీఎంకు వివరించారు. ఇదే సమయంలో వరదను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు గురించి కేంద్ర బృందం ప్రశంసించింది. మీ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమని, అంకిత భావంతో పనిచేసే అధికారులు మీకు ఉన్నారు, విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారని కేంద్ర బృందం అభిప్రాయపడింది. కేంద్రం తరఫున ఎన్ఎండీఎస్ సలహాదారు కునాల్ సత్యార్థి వివరాలు అందజేశారు. ఇక పర్యటనలో కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని, భారీ స్థాయిలో కురిసిన వర్షాలకు వచ్చే వరదను అడ్డుకునే రిజర్వాయర్లు గానీ, ప్రాజెక్టులుగానీ వరద ప్రభావిత ప్రాంతాల్లో లేవని కేంద్ర బృందం అభిప్రాయపడింది.

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా వరద ప్రభావం అధికంగా ఉందని గుర్తించామన్నారు. ఇక నష్టం అంచనా కోసం ఆయా ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందానికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రభుత్వ పని తీరు బాలేదని, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రచ్చ చేశారు.సీఎం జగన్ తీరుపై, ప్రభుత్వం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. గాల్లోనే వచ్చిన సీఎం గాల్లోనే వెళ్లిపోయారని విమర్శలు చేశారు. అప్పుడే జగన్ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆయన సంస్కారానికి నా నమస్కారం అంటూ పేర్కొన్న ఆయన వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అందులో ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు.

అధికారులంతా ఆ పనుల్లో బిజీగా ఉన్నారని.. ఒక వేళ సీఎం అక్కడి వెళ్తే.. అధికారులంతా సహాయ చర్యల పై కాకుండా.. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఫోకస్ పెడతారని.. దీంతో బాధితులు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెబుతూ వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు.. పరిహారాల గురించి అధికారులకు అన్ని ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. అయినా వినకుండా జగన్ వరదలు వస్తుంటే పెళ్లికి వెళ్లారు అని కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు టీడీపీ సభ్యులు. జగన్ అప్పటికే ఏరియల్ సర్వే చేశారు. దిగి వరద ప్రాంతాలకు నేరుగా వెళ్ళకున్నా అక్కడి లోకల్ ప్రజాప్రతినిధులు, అధికారులతో కో ఆర్డినేషన్ చేసి పని చేయించడంతో కేంద్ర బృందం భేష్ అనేలా చేశారు. మరి ఇప్పుడు టీడీపీ నేతలు ఏమంటారో వేచి చూడాలి మరి.

Also Read : Jagan, Chandrababu – ఏపీ రాజకీయాలు మారబోతున్నాయా..? ఇకపై సీఎం జగన్‌..