iDreamPost
android-app
ios-app

3 capitals – centrel minister Ramdas -మూడు రాజధానులపై రాందాస్ వ్యాఖ్యలు టీడీపీ నేతలనెందుకు కలవరపరుస్తున్నాయి

  • Published Oct 18, 2021 | 5:38 AM Updated Updated Mar 11, 2022 | 10:37 PM
3 capitals – centrel minister Ramdas -మూడు రాజధానులపై రాందాస్ వ్యాఖ్యలు టీడీపీ నేతలనెందుకు కలవరపరుస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు తిరస్కరించినా తమదే పైచేయి అన్నట్టుగా టీడీపీ వ్యవహరిస్తోంది. ప్రతీ అంశంలోనూ తమ మాటే చెల్లాబాటు కావాలని ఆశిస్తోంది. అసెంబ్లీలోనూ, బయటా ఆపార్టీ నేతల తీరు దానికి నిదర్శనంగా నిలుస్తోంది. కీలకమైన విధాన నిర్ణయాల్లో కూడా విపక్షం చెప్పిందే జరగాలనే పట్టుదలకు పోవడం ఆశ్చర్యం అనిపిస్తోంది. మూడు రాజధానుల అంశంలో ఇప్పటికే చట్టం ఆమోదించారు. ఉభయ సభలతో పాటుగా గవర్నర్ ఆమోదముద్ర కూడా పడింది. దాంతో చట్టం అమలుకావడం అనివార్యమనే వాతావరణం ఉంది.

చట్టం అమలుజరిగేందుకు సహకరిస్తే విపక్షం హూందాగా వ్యవహరించినట్టవుతుంది. కానీ టీడీపీ తీరు దానికి పూర్తిగా భిన్నం. ఏదేమయినా తాము చెప్పింది జరగకపోతే అన్ని రకాలుగానూ అడ్డంకులు సృష్టించాలనే లక్ష్యంతో ఆపార్టీ ఉంది. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇది స్పష్టమవుతోంది. అన్ని అంశాల్లోనూ అడ్డంకుల కోసం చేసిన యత్నాలు అందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. మూడు రాజధానులకు సంబంధించిన చట్టం అమలుకి కూడా అదే రీతిలో న్యాయపరమైన చిక్కులు కల్పించాలని చూస్తోంది. కోర్టుల సహాయంతో పాలనను ప్రభావితం చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది

వాస్తవానికి ప్రభుత్వ నిర్ణయాలు అంగీకారం లేనప్పుడు వాటికి అభ్యంతరం పెట్టడం, అడ్డుకునే ప్రయత్నం చేయడం చట్టపరమైన హక్కు. కానీ టీడీపీ మాత్రం ఓ అడుగు ముందుకేసి ఆ హక్కు ఆధారంగా పాలనకు బ్రేకులు వేయాలనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.

Also Read : Huzurabad BJP Etela -హుజూరాబాద్ టు రాష్ట్రం : బీజేపీ ప్లాన్ వ‌ర్క్ అవుట్ అవుతుందా.?

మూడు రాజధానుల చట్టం ఆమోదించబడి ఏడాది దాటిన నేపథ్యంలో అది అమలులోకి వస్తే ఏపీకి ఇప్పటికే అన్ని రకాలుగానూ ఆటంకాలు తొలగిపోయేవి. కానీ టీడీపీ తరుపున, ఇతర రూపాల్లో వేసిన పిటీషన్ల పరంపరతో న్యాయస్థానాల్లో కేసు నానుతోంది. దాని కారణంగా ఏపీలో రాజధాని వ్యవహారంలో స్పష్టత కరువయ్యింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రాజధాని విషయంలో రాజ్యాంగం చెప్పిన అంశాన్ని ప్రస్తావించింది. గవర్నర్ కూడా దానిని పరిగణలోకి తీసుకుని ఆమోదించారు. కేంద్రం కూడా తమ పరిధిలో లేదని చెప్పింది. అయినా విపక్షం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆ సమయంలోనే జనసేనాని కూడా తాము అమరావతి కోసమే బీజేపీతో కలిశామని పలుమార్లు చెప్పినా బీజేపీ అధినేతలు అందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపించలేదు.

తాజాగా కేంద్ర మంత్రి రాందాస్ అఠావలే కూడా రాజధానుల అంశం రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమేనని తేల్చేశారు. దాని కోసం విపక్షాలు అడ్డంకులు పెట్టడం సరికాదని కూడా అన్నారు. దాంతో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా వెల్లడించినట్టయ్యింది. ఏపీలో అభివృద్ధికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ జగన్ ని అభినందించిన ఆయన తనకు మిత్రుడని చెబుతూనే ఎన్డీయేలో చేరిక గురించి కూడా మాట్లాడారు. కానీ రాజధాని విషయంలో రాందాస్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతలకు మింగుడుపడడం లేదు. బీజేపీలో ఉన్న బాబు అనుచరులకు కూడా రుచించడం లేదు. దాంతో కేంద్ర మంత్రి ప్రకటనపై లంక దినకర్ వంటి వారు ఘాటుగానే స్పందించారు. కానీ విధానపరంగా తమ వైఖరిని కేంద్రం కూడా అటు కోర్టుల్లోనూ, ఇటు బయట కూడా స్పష్టత ఇస్తున్నా ఇంకా అర్థం చేసుకోలేకపోవడం విపక్షాల విడ్డూరపు ధోరణిని చాటుతోంది.

Also Read : Kesineni Nani -CBN -బాబుకి కేశినేని షాకిస్తారా? లేక ప్లాన్ లో భాగమేనా?