iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా అంశంపై కొంత కదలిక వచ్చిందని భావిస్తున్న తరుణంలో కేంద్రం మళ్ళీ మెలిక పెట్టింది. త్రిసభ్య కమిటీ చర్చించాల్సిన అంశాలలో ప్రత్యేకహోదా తొలగించింది. ఉదయం విడుదల చేసిన నోటిఫికేషన్ సవరించింది. కొత్తగా మరో నోటిఫికేషన్ జారీచేసింది.
ఏపీ, తెలంగాణ మధ్య పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్రం చర్చలకు శ్రీకారం చుట్టింది. ఈనెల 17న భేటి కి ఏర్పాట్లు చేసింది. సమావేశంలో చర్చించే ప్రధాన అజెండా సిద్ధం చేసింది. అందులో ప్రత్యేకహోదా ప్రస్తావించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్త ఆశలు రేపింది. ఇటీవల పదే పదే ముఖ్యమంత్రి హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ, కేంద్రం మీద ఒత్తిడి తెస్తున్న తరుణంలో కేంద్ర హోమ్ శాఖ అధికారికంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
అయితే అనూహ్యంగా ఉదయం జారీచేసిన నోటిఫికేషన్ నుంచి ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని తొలగించడం విస్మయకరంగా పరిణమించింది. అజెండాలో మార్పులు చేస్తూ మరో సర్క్యులర్ జారీ చేయడం తెలుగు ప్రజలను నిరాశపరిచింది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఎపికి హోదా అంశంపై తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈనెల 17న కీలక సమావేశం ఏర్పాటు నేపథ్యంలో కేంద్రం మెలికలు పెట్టడం విశేషంగా మారింది.
Also Read : ఏపీకి ప్రత్యేకహోదా దిశగా కేంద్రం అడుగులు, ఫలించిన జగన్ ఒత్తిడి