Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మంత్రి వర్గ నిర్ణయాలను మీడియా కు వెల్లడించారు. అమ్మ ఒడి పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇంటర్ వరకు విద్యార్థుల తల్లి తండ్రులకు ఏడాదికి 15 వేళా రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. తల్లిదండ్రులు లేకపోతె పిల్లల సంరక్షకులకు అందజేయనున్నారు.
– 147 గ్రామీణ నియోజక వర్గాల్లో అగ్రి ల్యాబ్ లు ఏర్పాటు. విత్తనాలు, ఎరువులు పరీక్ష చేసిన తర్వాత రైతులకు అందివ్వడం
– హజ్, జెరూసలేం వెళ్లే యాత్రికులకు ఆర్థిక సహాయం పెంపు
– మరింత పౌష్టికాహారం ఇచ్చేందుకు పైలెట్ ప్రాజెక్టుకు ఆమోదం. 77 మండలాల్లో 90 కోట్ల తో నిర్వహణకు నిర్ణయం.
– మాల, మాదిగ, రెల్లి కులాల వారికి వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు.
– పాఠశాల లో మౌలిక సదుపాయాల కల్పన. నాడు – నేడు పధకానికి ఆమోదం
– మత్స్య కారులకు డీజిల్ సబ్సిడీ, వేట నిషేదంలో ఇచ్చే పరిహారం పెంపు.
– తలసీమియా బాధితులకు 10 వేలు పింఛన్. పక్షవాతం బాధితులకు, స్టేజి 3,4,5 లో ఉన్న కిడ్నీ బాధితులకు 5 వేల పింఛన్
– ఆపరేషన్ తర్వాత రోగులకు రోజుకు 225 రూపాయలు లేదా నెలకు 5 వేలు సాయం
– ఆస్పత్రుల్లో పని చేసే పారిశుధ్య కార్మికులకు వేతనం 8 వేళా నుంచి 16 వేలకు పెంపు
– 300 గజాల లోని ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వారికి నామమాత్రపు ధరకే రిజిస్ట్రేషన్.
– జగ్గయ్యపేట లో సినీ హీరో బాలయ్య బందువుల కంపెనీ వీబీసీకి తక్కువ ధరకు ఇచ్చిన 498.3 ఎకరాల భూమి కేటాయింపు ఉత్తర్వులు రద్దు.
– వైజాగ్ లో లులూ సంస్థ కు ప్రభుత్వ భూమి ఇస్తూ జారీ చేసిన ఉత్తర్వులు రద్దు.
– అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం