iDreamPost
android-app
ios-app

జీరో బడ్జెట్, కేసీఆర్ నుంచి రాహుల్ వరకు… ఏం బాగోలేదన్న విపక్షాలు

  • Published Feb 01, 2022 | 9:24 AM Updated Updated Mar 11, 2022 | 10:20 PM
  • Published Feb 01, 2022 | 9:24 AMUpdated Mar 11, 2022 | 10:20 PM
జీరో బడ్జెట్, కేసీఆర్ నుంచి రాహుల్ వరకు… ఏం బాగోలేదన్న విపక్షాలు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తెలంగాణా సీఎం కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని కేసీఆర్ అసహనం వ్యక్తం చేేశారు. నేడు కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్…దశ దిశా నిర్దేశం లేని, పనికి మాలిన, పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ అని ఆయన అభివర్ణించారు. కేంద్ర ఆర్థిక మంత్రి చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనం తో నిండి, మాటలగారడీ తో కూడి ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ, మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ గా ఉందని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమని ఆయన మండిపడ్డారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్ బిగ్ జీరో గా అభివర్ణించారు. అలాగే దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందన్న ఆయన… నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేేశారు.

ఉద్యోగులను చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆదాయపు పన్నులో స్లాబ్స్ ను ఏమీ మార్చకపోవడం విచారకరమన్న ఆయన… ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురు చూశారని, వారి ఆశలమీద కేంద్ర బడ్జెట్ నీళ్ళు చల్లిందని ఆరోపించారు. వైద్యం తదితర ప్రజోరోగ్యం , మౌలిక రంగాలను అభివృద్ధి పరచడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విషయం ఈ బడ్జెట్ ద్వారా తేటతెల్లమైందని విమర్శించారు.

అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా కరోనా కష్టకాలంలో హెల్త్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి పరుస్తున్న సమయంలో… ఆ దిశగా కేంద్రానికి సోయి లేకపోవడం విచారకరమని ఆయన వ్యాఖ్యలు చేేశారు. కరోనా నేపథ్యంలో దేశ వైద్య రంగాన్ని అభివృద్ధి పరచడం మౌలిక వసతుల పురోగతికి చర్యలు తీసుకునేందుకు చర్యలు చేపట్టలేదన్న ఆయన… దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని దుమ్మెత్తిపోశారు.

కేసీఆర్ తో పాటుగా పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కూడా బడ్జెట్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరుద్యోగం ,ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్య ప్రజలకు బడ్జెట్‌లో జీరో అన్నారు.  ఒక్కటి కూడా స్పష్టత లేకుండా పెద్ద పెద్ద పదాలతో బడ్జెట్ నిండిపోయింది అని పెగాసస్ స్పిన్ బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందిస్తూ… మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పెద్ద సున్నా అని… జీతాలు తీసుకునే తరగతి – మధ్య తరగతి – పేదలు & అణగారిన – యువత – రైతులు – ఎంఎస్ఎంఈలు ఏమీ లేదని ఆయన ఆరోపించారు.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet giriş