iDreamPost
android-app
ios-app

పాట్నాలో బాంబు పేలుడు

పాట్నాలో బాంబు పేలుడు

బీహార్ రాజధాని, పాట్నాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. గాంధీ మైదాన్ ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగిన పేలుడు ధాటికి ఐదు ఇళ్ళు ధ్వంసం అయ్యాయి.. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు..

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి పేలుడు సంభవించడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఇంట్లో దాచి ఉంచిన బాంబు పేలడం వల్లే పేలుడు సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు..

ఈ ఘటనలో 12 మంది గాయపడగా, గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.. క్లూస్ టీమ్, బాంబు స్క్వాడ్ టీమ్ పేలుడు జరిగిన ప్రాంతానికి చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. కాగా దీనివెనుక ఉగ్రవాద కోణం ఏదైనా ఉందా అన్న దిశగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఇంట్లో దాచిన బాంబు అకస్మాత్తుగా పేలడం వల్లనే భారీ పేలుడు జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు.. కానీ ఆ ఇంట్లో బాంబు ఎందుకుంది అన్న కోణంలో దర్యాప్తును మొదలుపెట్టారు పోలీసులు..

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Girişiptv satın al