Idream media
Idream media
దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సత్తా చాటుతోంది. కరోనా వైరస్‌తో దేశం యావత్తు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడిన తర్వాత మొదటి సారి జరిగిన ఈ ఉప ఎన్నికల్లో అధికార బీజేపీ మంచి ఫలితాలు సాధించే దిశగా వెళుతుండడం ఆ పార్టీ శ్రేణల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
గుజరాత్‌లో ఎనిమిది స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో ఉన్నారు. జార్ఖండ్‌లో రెండు స్థానాలకు గాను చెరొక స్థానంలో బీజేపీ, కాంగ్రెస్‌లు లీడింగ్‌లో ఉన్నాయి. కర్ణాటకలో రెండు స్థానాల్లోనూ బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
మధ్యప్రదేశ్‌లో 29 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 19 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 8, బీఎస్పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. మణిపూర్‌లో ఐదు స్థానాలకు గాను నాలుగింటిలో బీజేపీ, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. నాగాలాండ్‌లో రెండు స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులు గెలుపు దిశగా పయనిస్తున్నారు.
ఒడిషాలో రెండు స్థానాల్లోనూ అధికార బిజు జనతా దళ్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో ఏడు స్థానాలకు గాను ఆరింటిలో బీజేపీ విజయం దిశగా వెళుతుండగా.. మరొక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. తెలంగాణలో ఒకే ఒక స్థానంలో బీజేపీ లీడ్‌లో ఉంది.
హర్యానా, ఛత్తీష్‌ఘడ్ రాష్ట్రాలలో ఒక్కొక్కటి చొప్పున జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం దిశగా సాగుతోంది.