iDreamPost
android-app
ios-app

పశువైద్యుడికి చేదు అనుభవం.. ట్రీట్మెంట్ పేరుతో ఇంటికి రప్పించి రాక్షసత్వం..

  • Published Jun 15, 2022 | 6:33 PM Updated Updated Jun 15, 2022 | 6:33 PM
పశువైద్యుడికి చేదు అనుభవం.. ట్రీట్మెంట్ పేరుతో ఇంటికి రప్పించి రాక్షసత్వం..

సాధారణంగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి.. పెళ్లిళ్లు చేసుకున్న ఘటనల గురించి వినేఉంటారు. కానీ.. అబ్బాయిలను.. కిడ్నాప్ చేసి పెళ్లిచేసేయడం అరుదు. బ్యాచిలర్ పశువైద్యుడిని కిడ్నాప్ చేసి, తమ కూతురికిచ్చి వివాహం జరిపించిన ఘటన బీహార్ లో జరిగింది. బెగుసురాయ్ లో ఓ కుటుంబం తమ ఇంట్లో పశువుకి సుస్తి చేసింది. వైద్యం చేసేందుకు అర్జెంటుగా రావాలంటూ పశువైద్యుడికి ఫోన్ చేశాడు. వారిమాటల్లో కంగారును గ్రహించి.. ఆ యువ వైద్యుడు ఆగమేఘాలమీద ఆ గ్రామానికి బయల్దేరగా మార్గంమధ్యలోనే అతడిని కిడ్నాప్ చేసి, తమ ఇంట్లో అమ్మాయికి ఇచ్చి బలవంతంగా పెళ్లిచేసేశారు. ఈ విషయం తెలిసి వైద్యుడి తండ్రి ఖంగుతిన్నాడు.

ఈ ఘటనపై వెటర్నరీ వైద్యుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కొడుకు కనిపించడం లేదని మిస్సింగ్ కేసు కూడా పెట్టారు. కానీ.. బెగుసురాయ్ ఎస్పీ యోగేంద్ర కుమార్ ఈ ఘటనపై సాదాసీదాగా స్పందించారు. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో.. తమ ఇంటి బిడ్డల కోసం పెళ్లి కాని అబ్బాయిలను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి చేస్తారట. ఈ వ్యవహారం ఇక్కడ సర్వసాధారణమని, ఈ వివాహాన్ని పకడ్వా వివాహమని పిలుస్తారని చెప్పడం గమనార్హం. ఇలాంటి ఘటనలు బాధిత వ్యక్తులు పోలీసులను ఆశ్రయిస్తే కిడ్నాప్ చేసి, పెళ్లి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.