iDreamPost
android-app
ios-app

ఆఫర్లు పట్టేస్తున్న బిగ్ బాస్ స్టార్లు

  • Published Mar 03, 2021 | 9:51 AM Updated Updated Mar 03, 2021 | 9:51 AM
ఆఫర్లు పట్టేస్తున్న బిగ్ బాస్ స్టార్లు

బిగ్ బాస్ 4 అయిపోయి చాలా రోజులయ్యింది. స్టార్ మా ఛానల్ షోలో పాల్గొన్న వాళ్ళను తీసుకొచ్చి ఏవేవో ప్రోగ్రాములు చేస్తోంది కానీ గతంలో లేని విధంగా అందులో పార్టిసిపెంట్స్ కి సినిమా అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి. ఆ మధ్య అఖిల్ మోనాల్ జంటగా ‘ఆంధ్ర అబ్బాయి గుజరాతి అమ్మాయి’ అనే మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైనట్టు ఉంది. దీని కన్నా ముందే మోనాల్ అల్లుడు అదుర్స్ లో ఐటెం సాంగ్ చేసి గట్టిగానే రెమ్యూనరేషన్ రాబట్టుకుంది. ఇంతా చేసి విన్నర్ అభిజిత్ కు మాత్రం సోలో హీరోగా ఇంకా ఏ ప్రాజెక్ట్ సెట్ అయినట్టు లేదు. ఇది కొంత విచిత్రంగా అనిపించినా నిజం.

తాజాగా సోహైల్ సినిమా కూడా స్టార్ట్ అయ్యింది. శ్రీనివాస్ వింజంపాటి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇవాళ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టైటిల్ డిసైడ్ చేయలేదు. దీనికి మంచి టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు. నిజార్ షఫీ ఛాయాగ్రహణం సమకూరుస్తుండగా శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించడం విశేషం. ఈ ఇద్దరూ డిమాండ్ ఉన్న వాళ్ళే. గెటప్ చూస్తుంటే యాక్షన్ థ్రిల్లర్ లుక్ ఉంది. షూటింగ్ ఈ రోజు నుంచే మొదలుపెట్టబోతున్నారు. ఆ మధ్య డిసెంబర్ లో లాంఛనంగా ప్రకటించింది ఇదే. ఇప్పుడు రంగంలోకి దిగి వేగం పెంచబోతోంది.

మొత్తానికి బిగ్ బాస్ గ్యాంగ్ కి ప్రస్తుతానికి అవకాశాలు బాగానే ఉన్నాయి. లాస్య యుట్యూబ్ ఛానల్ ని పెట్టేసుకుని ఇంట్లో చేసే వీడియోలకు కూడా మిలియన్ల వ్యూస్ రాబట్టుకుంటోంది. మరోవైపు అవినాష్ హ్యాపీగా స్టార్ మాలోనే వివిధ కార్యక్రమాలకు పెర్మనెంట్ పార్టిసిపెంట్ గా మారిపోయాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కో దారిలో వెళ్లిపోతున్నారు. గత సీజన్లో శివబాలాజీ లాంటి వాళ్ళు ఒక సినిమాకే పరిమితమైతే మరి ఇప్పుడు సోహైల్, అఖిల్ లైనా కాస్త ఎక్కువ దూరం వెళ్తారేమో చూడాలి. అన్నట్టు మెహబూబ్ మాత్రం బయట పెద్దగా కనిపించడం లేదు. ఆచార్యలో ఏదో చిన్న వేషం అన్నారు కానీ డౌట్ గానే అనిపిస్తోంది

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş