iDreamPost
android-app
ios-app

కట్టలు తెగిన కన్నీళ్ళు – కంచెలు దాటిన సెంటిమెంట్లు

  • Published Nov 20, 2020 | 6:02 AM Updated Updated Nov 20, 2020 | 6:02 AM
కట్టలు తెగిన కన్నీళ్ళు – కంచెలు దాటిన సెంటిమెంట్లు

మొన్నటి నుంచి కుటుంబ సభ్యుల ఎంట్రీతో హౌస్ ని ఎమోషనల్ గా మార్చేసిన బిగ్ బాస్ నిన్న కూడా దాన్ని కొనసాగించారు. పార్టిసిపెంట్స్ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి కోవిడ్ నిబంధనల ప్రకారం ఒకరితో మరొకరు తాకే అవకాశం లేకుండా గ్లాస్ డోర్ ద్వారా కలుసుకునే ఏర్పాటు చేయడం వెరైటీగా ఉంది. అయితే ఏదో పది ఇరవై ఏళ్ళ తర్వాత తమవాళ్ళను కలుసుకున్నామనే రేంజ్ లో కొందరు ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం చూస్తే మాత్రం సదరు నాటకీయత మీద ఎవరికైనా అనుమానం వస్తే అది మీ తప్పు కాదు. కాకపోతే రెండు నెలలకు పైగా బయట ప్రపంచానికి దూరంగా ఉన్నప్పుడు ఫీలింగ్ ఉండటం సహజం కానీ మరీ ఈ స్థాయిలో అయితే కాదు.

మాములుగానే సీరియల్ ఆర్టిస్టుకన్నా వందరెట్లు అధికంగా కన్నీళ్లతో కర్చీఫులు తడిపేసే మోనాల్ నిన్న కెరీర్ బెస్ట్ ఇచ్చేసింది. తను అలా చేయాలనే ముందుగా తల్లి ఆడియో మెసేజ్ వినిపించిన బిగ్ బాస్ బాత్రూమ్ వెళ్లి మరీ కన్నీటిధారలు కట్టలు తెంచుకునేలా చేశాడు. అదంతా అయ్యాక చల్లగా అప్పుడు మోనాల్ అక్క హేమాలిలో ప్రవేశపెట్టాడు. అప్పటికే ఓ ట్యాంకర్ నీటిని వదిలిన మోనాల్ మళ్ళీ ఫ్రెష్ గా ఇంకో బ్యాచ్ కన్నీళ్లు విడుదల చేసింది. చెల్లి కోసం వచ్చిన మొనాలి పనిలో పనిగా అభిజిత్ కు చిన్న క్లాసు తీసుకుంది. సోహైల్ తో కూడా చర్చించి. సోదరికి ధైర్యం చెప్పి సెలవు తీసుకుంది.

అయితే ఈ క్రమంలో మొనాలి అభిజిత్ ని టార్గెట్ చేయడంతో హారిక హర్ట్ అయ్యింది. ఇదే విషయాన్ని అరియనా, అభిజిత్ ల ముందు చెప్పుకొచ్చింది. ఇదేదో బంపర్ ఆఫర్ లా ఉందని గుర్తించిన అఖిల్ వెంటనే రంగంలోకి దిగి మోనాల్ దగ్గరకు వెళ్లి ఆమె అక్కయ్య స్ట్రెయిట్ ఫార్వార్డ్ నెస్ గురించి పొగడ్తలు కురిపించింది. అరియనా కోసం వినీత్ వచ్చినప్పుడు కూడా ఇదే డ్రామా కొనసాగింది. తానేమి తక్కువ తినలేదు అనే తరహాలో ఆమె కూడా చాలా ఓవర్ చేసింది. అతను నార్మల్ గా ఉన్నప్పటికీ అరియనా ఆలా ఉండకూడదు అనే తరహాలో రెచ్చిపోయింది. అతను అవినాష్ ను పలకరించబోతున్నా ఇదే తీరులో ప్రవర్తించింది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişMeritkingcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbetHoliganbet Giriş