iDreamPost
android-app
ios-app

ఏకాగ్రతలో బిగ్ బాస్ – శాంతించిన సభ్యులు

  • Published Dec 11, 2020 | 5:59 AM Updated Updated Dec 11, 2020 | 5:59 AM
ఏకాగ్రతలో బిగ్ బాస్ – శాంతించిన సభ్యులు

మొన్న ఆవేశాలతో ప్రతీకారాలతో హౌస్ ని వేడెక్కించిన బిగ్ బాస్ సభ్యులు నిన్న కొంచెం శాంతించారు. రోజూ అలా చేస్తే బాగుండదనుకున్నారో లేక తమకే ఎక్కువ చేశామని అనిపించిందో తెలియదు కానీ మొత్తానికి కొంత కూల్ గానే సాగింది. కిచెన్ లో మోనాల్, సొహైల్ మధ్య కాసేపు కామెడీ జరిగింది. ఆమె చేతిని కొరకడానికి ప్రయత్నించడం, ఆమె దోసె పెనంతో బెదిరించడం ఇదంతా అలా సాగిపోయింది. ఓపికతో టాస్కులో హౌస్ మేట్స్ తో ఆడుకున్న బిగ్ బాస్ ఈసారి ఏకాగ్రత అంటూ మరో కొత్త ఘట్టానికి తెరతీశాడు. కాకపోతే ముందులాగా మరీ తీవ్రమైన భావోద్వేగాలకు గురి కాకుండా అందరూ జాగ్రత్త పడ్డారు.

దీని ప్రకారం ఒక్కో మెంబెర్ అరగంట సమయాన్ని ఆపకుండా కౌంట్ చేయాలి. మిగిలినవాళ్లు వీళ్ళ కాన్సంట్రేషన్ చెడగొడుతూ పాయింట్స్ తగ్గేలా చేయాలి. గార్డెన్ ఏరియాలో ఉన్న క్లోక్ ని దీని కోసమే సెట్ చేశారు. అలాగే టాస్కులో ఉన్న వాళ్ళను ఏదో ఒక ప్రశ్న అడుగుతూ కన్ఫ్యూజ్ చేయాలి. ఫైనల్ గా ఎవరైతే సరిగ్గా 30 నిమిషాల టైంని ఊహించగలరో వాళ్లే విన్నర్ అన్నమాట. అంతేకాదు గోల్డెన్ మైక్ కూడా కానుకగా దక్కుతుంది. ఇది కాకూండా పార్టిసిపెంట్ కు విచిత్రమైన పనులు కూడా ఇచ్చారు. ఉల్లిపాయలు కట్ చేయడం, అల్లం తోలు వొలవడం, మొక్కజొన్న, వేరుశెనగ తీయడం లాంటివి చాలానే చేయాలి.

మోనాల్ అఖిల్ ల మధ్య పరస్పరం సహాయం చేసుకునే ఒప్పందం కుదిరింది. ఫస్ట్ మోనాల్ పాల్గొన్నప్పుడు అభిజిత్, హారిక, సోహైల్, అరియనాలు ప్రశ్నలు అడిగారు. అభిజిత్ మోనాల్ ని పిల్లలు ఎలా పుడతారని డబుల్ మీనింగ్ క్వశ్చన్ అడిగాడు. దానికి సమాధానంగా మోనాల్ హాస్పిటల్ లో అమ్మకు పుడుతుందని చెప్పి తెలివిగా తప్పించుకుంది. అందరికీ ఇలా తతంగం జరిగాక ఫైనల్ గా అరియనా విన్నర్ గా నిలిచింది. మొన్నటి రచ్చ గురించి మళ్ళీ మోనాల్ అఖిల్ ల మధ్య చర్చ జరిగింది. ముందు అఖిల్ పై అరిచినా ఆ తర్వాత మళ్ళీ కూల్ చేశాడు సోహైల్. రేపు నాగ్ ఎంట్రీ ఉంటుంది కాబట్టి ఈ రోజు ఏం జరుగుతుందో చూడాలి

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişMeritkingcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetiptv satın alMadridbetHoliganbet Giriş