iDreamPost
android-app
ios-app

దెయ్యం ఎంట్రీ – బిగ్ బాస్ లో హారర్ ట్విస్ట్

  • Published Nov 26, 2020 | 6:30 AM Updated Updated Nov 26, 2020 | 6:30 AM
దెయ్యం ఎంట్రీ – బిగ్ బాస్ లో హారర్ ట్విస్ట్

ఇంకో ఇరవై రోజులల్లో షో ముగింపుకొచ్చే అవకాశం ఉండటంతో రొటీన్ టాస్కులతో కొంత వినోదాన్ని కొంత బోర్ ని సమానంగా పంచుతున్న బిగ్ బాస్ హౌస్ ఈసారి వెరైటీగా దెయ్యాల కొంపగా మారింది. దీనికన్నా ముందు ఎప్పటిలాగే సభ్యులు తమ కార్యక్రమాన్ని కొనసాగించారు. అఖిల్ ఎంత వద్దని చెబుతున్నా మోనాల్ అతని వెనుక పడటం మానడం లేదు. కవ్వించే ప్రయత్నం చేసినప్పటికీ అఖిల్ ధీటుగా బదులిచ్చి నువ్వు చెప్పేవన్నీ అబద్దాలంటూ టైర్ పంచర్ చేసేశాడు. ఈసారి అవినాష్ ని టార్గెట్ చేసిన అఖిల్ అందుకోసం అరియనాతో కలిసి బాగా క్లోజ్ అవుతున్నట్టు కవ్వించాడు. మేము చాలా క్లోజ్ అని కలరింగ్ ఇచ్చాడు.

తాను అలాగే చేద్దామని ట్రై చేసిన అవినాష్ ప్లాన్ వర్కవుట్ కాలేదు. రివర్స్ లో మోనాలే అఖిల్ కు జ్యూస్ తెచ్చి ఇవ్వడం ఇంకో ట్విస్ట్. ఇక దెయ్యం టాస్కు మొదలయ్యాక అరియనా చేసిన పెరఫార్మన్స్ నభూతో నభవిష్యతి. దెయ్యం ఖచ్చితంగా నిజం కాదని అక్కడనున్న వారికి చూసేవారికి అందరికీ తెలుసు. కానీ మరీ అంతగా భయపడిపోవడం చూస్తే అదేదో సినిమాలో చెప్పినట్టు మార్కుల కోసమే. హారిక దెయ్యంకే సవాలు చేసింది. అవినాష్ కామెడీ చేయబోతే అఖిల్ పంచులు వేసి గాలి తీసేశాడు. బాత్ రూమ్ తలుపులు మూసేసినప్పుడు హారిక మరీ ఓపెన్ గా మాట్లాడ్డం ఎబ్బెట్టుగా అనిపించింది. ఆ మాటలక్కడ అవసరం కూడా లేదు.

ఆ తర్వాత జలజ అనే దెయ్యం వాయిస్ ఓవర్ లో అక్కడికి ప్రవేశించింది. టాస్కులు తాను ఇస్తానని చెప్పింది. అభిజిత్ కు ఆకులు లెక్క పెట్టే పనిని ఇచ్చింది. మోనాల్ తో డేట్ కి సంబంధించి దెయ్యం లింక్ పెట్టడంతో అభిజిత్ ఫైర్ అయ్యాడు. ఆమెను ఏడిపించలేనని తెగేసి చెప్పాడు. దీంతో అఖిల్ కు ఆ బాధ్యత పడింది. అభిజిత్ మొదటిసారి కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. హారిక వచ్చి ఓదార్చింది. మోనాల్ తో డేట్ ఫిక్స్ అయిన అఖిల్ మరోసారి తనలో అపరిచిత ప్రేమికుడిని బయటికి తీశాడు. ఈ దెయ్యాల గోల ఈ రోజు కూడా కొనసాగబోతోంది. ఇంకో రెండు రోజుల్లో ఎలిమినేషన్ ఉండటంతో ఎలా జరగబోతోందో చూడాలి

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alAlobetAlobetPiabellacasinokatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş