iDreamPost
android-app
ios-app

ఊరించి వెళ్ళిపోయిన సుమ – సెలవు తీసుకున్న అమ్మ

  • Published Nov 09, 2020 | 5:59 AM Updated Updated Nov 09, 2020 | 5:59 AM
ఊరించి వెళ్ళిపోయిన సుమ – సెలవు తీసుకున్న అమ్మ

నిన్న ఉదయం నుంచి బిగ్ బాస్ 4 ప్రోమోల్లో సుమ వైల్డ్ కార్డు ఎంట్రీ అనగానే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. చాలా డల్ గా సాగుతున్న షోలో తను వస్తే ఎనర్జీ ఏ స్థాయిలో ఉంటుందో వేరే చెప్పాలా. అందుకే అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. అయితే వాటిని నీరుగారుస్తూ సుమ కేవలం నిన్నటికే పరిమితమయ్యింది. అసలు హౌస్ లోకి కూడా ఎంటర్ కాలేదు. తనకు సినిమాల ఈవెంట్లు, టీవీ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయని గంగవ్వ వయసు రాగానే ఇందులో పాల్గొంటానని చెప్పి ట్విస్ట్ ఇచ్చింది. అది అది వచ్చే సంవత్సరమే అని నాగార్జున కౌంటర్ ఇవ్వడం బాగా పేలింది. సుమ ఉన్నంత సేపు చాలా ఫన్నీగా నడిచిన మాట వాస్తవం. పంచులు బాగా వర్కౌట్ అయ్యాయి.

ముందే లీకైనట్టుగా అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్ అయ్యాడు. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన నెగటివిటీ మూటగట్టుకున్న ఈయన వ్యవహారశైలిపై చాలా బ్యాడ్ ఫీడ్ బ్యాక్ ఉంది. అయినా డ్రామా కోసం బిగ్ బాస్ ఓట్ల ప్రాతిపాదికన కాకుండా కాపాడుతున్నారనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈయన్నే బయటికి తెచ్చేయడం గమనార్హం. ముందు అవినాష్, అమ్మ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందన్నట్టు నాగార్జున బిల్డప్ ఇచ్చినప్పటికీ ఫైనల్ గా ఊహించిందే జరిగింది. తర్వాత అవినాష్ యధాలాపంగా తను సేవ్ అయినందుకు అద్భుతమైన ఎక్స్ ప్రెషన్లతో ఓ రేంజ్ లో జీవించేశాడు. ఇంత అవసరమా అనిపించింది కూడా.

ఇక అసలు నకిలీ కాన్సెప్ట్ ఇచ్చిన నాగ్ టాస్కుకు బదులుగా అమ్మ రాజశేఖర్ మరీ నోయెల్ తరహాలో దాడి చేయకుండా ఎవరు ప్లస్ ఎవరు మైనస్ అనేది చెప్పేసి మమ అనిపించారు. బయటికి వెళ్తూ కెప్టెన్ బాధ్యతను మెహబూబ్ కు అప్పజెప్పారు. అయితే ఇది తాత్కాలికమే కాబట్టి అతను ఎక్కువ సంతోషించడానికి లేదు. ఇక రేపటి నుంచి టెన్త్ వీక్ ఎలిమినేషన్ ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. సభ్యులు తగ్గిపోతున్నారు కనుక ఇకపై ఎలాంటి ఆటలు ఉంటాయన్నది వేచి చూడాలి. మహా అయితే ఇంకో నలభై రోజుల్లో బిగ్ బాస్ కథ ముగింపుకొస్తుంది. డిసెంబర్ ఆఖరు దాకా సాగదీసే ఆలోచన కూడా ఉందట. ఇంకా క్లారిటీ రావాలి. కొత్త ఎంట్రీలు ఉండే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

Jojobet GirişBetcioivermectin tabletpokerklaspokerklaspokerklasmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş