iDreamPost
android-app
ios-app

ఛాన్స్ కొట్టేసిన సొహైల్ – లీకైన ఈరోజు ఎలిమినేటర్

  • Published Dec 13, 2020 | 5:53 AM Updated Updated Dec 13, 2020 | 5:53 AM
ఛాన్స్ కొట్టేసిన సొహైల్ – లీకైన ఈరోజు ఎలిమినేటర్

ఇంకో వారం రోజుల్లో ముగియబోతున్న బిగ్ బాస్ 4 తుది ఘట్టానికి దగ్గరవుతోంది. ఈ వారం మొత్తం జరిగిన చిత్రవిచిత్ర ఎమోషనల్ టాస్కుల్లో సభ్యులు పోటీ పడి మరీ జీవించేయగా నిన్న నాగార్జున తొలి ఫైనలిస్ట్ గా సొహైల్ ని ప్రకటించడం పెద్ద ట్విస్ట్. అరియనాతో తను గొడవ పడిన విధానం, అమ్మాయని చూడకుండా ఆమె మీద నోరు పారేసుకోవడం సోషల్ మీడియాలో చర్చకు దారి తీయడంతో పాటు నెగటివ్ కామెంట్స్ కు కూడా ఆస్కారమిచ్చాయి. దీని గురించి సొహైల్ మొన్నే బిగ్ బాస్ కు వివరణ ఇచ్చుకున్నాడు కూడా. నాగ్ కూడా ప్రత్యేకంగా ఈ ఇష్యూ మీదనే సెపరేట్ గా క్లాస్ తీసుకోవడం గమనించాల్సిన అంశం.

జిగేల్ అంటున్న పూల చొక్కా సన్ గ్లాసెస్ తో మన్మథుడు ఎప్పటికీ తనే అన్న రీతిలో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఉన్న ఆరుగురిలో నచ్చిన ముగ్గురిని నచ్చని ఇద్దరి గురించి చెప్పమని టాస్క్ ఇచ్చారు. ఇది చాలా సార్లు చూసిందే కనక పెద్ద ఆసక్తికరంగా అనిపించలేదు కానీ నిన్న చాలా కీలకమైన ఎపిసోడ్ కాబట్టి ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అలా అందరూ వాళ్ళ అభిప్రాయం ప్రకారం పేర్లు చెప్పగా ఆ తర్వాత అరియనా సొహైల్ కు నాగార్జున ప్రత్యేకంగా క్లాస్ తీసుకున్నాడు. ముఖ్యంగా అరియనాకు గట్టి అక్షింతలు పడ్డాయి. లేడీ ట్యాగ్ ని ఉపయోగించి సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.

సోహైల్ ను కూడా నాగ్ నిలదీశారు. ఆవేశంలో చెప్పిన మాటల్లో లాజిక్ ఉన్నప్పటికీ అంతగా అరవాల్సిన అవసరం లేదని, దీని వల్లే అరియనా హర్ట్ అవ్వాల్సి వచ్చిందని చెప్పారు. అయితే మిగిలిన మెంబెర్స్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు అధిక శాతం అరియనానే ఓవరాక్షన్ చేసిందనే అభిప్రాయం వ్యక్తం చేయడంతో జరిగిన గొడవలో ఎవరిది ఎక్కువ పాలో క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ ఫైనలిస్ట్ పేరుని చెప్పే అవకాశం అఖిల్ కు ఇచ్చిన నాగ్ ఎపిసోడ్ చివర్లో సొహైల్ ని ప్రకటించారు. ఆనందంతో అతను అరియనాకు ముద్దు కూడా పెట్టాడు. ఇవాళ మోనాల్ ఎలిమినేట్ కాబోతోందని లీక్ వర్గాల సమాచారం.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaMarsbahis GirişCasibom GirişMarsbahis GirişJojobet Giriş