iDreamPost
android-app
ios-app

ఆ ఇద్దరి ఓవరాక్షన్ – రద్దైన కెప్టెన్ టాస్క్

  • Published Nov 11, 2020 | 6:45 AM Updated Updated Nov 11, 2020 | 6:45 AM
ఆ ఇద్దరి ఓవరాక్షన్ – రద్దైన కెప్టెన్ టాస్క్

బిగ్ బాస్ లో కొత్త వారం కాస్త కొత్తగా మిగిలినదంతా చప్పగా సాగుతోంది. చిన్న చిన్న సరదాలు జోకులు, ఏడ్పులు, పెడబొబ్బలతో ఏదో ఆలా సాగిపోతోంది. నిన్నటి విషయానికి వస్తే లాస్య, సోహైల్ ల మధ్య ఆంటీ అని పిలుచుకోవడం గురించి కాసేపు కామెడీ జరిగింది. మధ్యలో అరియనా కూడా వచ్చింది. ఇక కెప్టెన్సీ టాస్కు ఈసారి వెరైటీగా పెట్టారు. దాని ప్రకారం సభ్యుల ఫోటోలు ఉన్న బాస్కెట్ బాల్స్ ని ఒక్కొక్కరు ఒక్కోటి తీసుకోవాలి. కాకపోతే తమది కాకుండా ఇంకెవరిదైనా ఎంచుకోవచ్చు. బజార్ మ్రోగగానే దాన్ని బాస్కెట్ లో వేయాలి. ఎవరి బాల్ ఆఖరున పడుతుందో వాళ్ళు రేస్ నుంచి తప్పుకోవాలి. మిగిలినవాళ్లు కంటెస్టెంట్స్ గా పోటీ చేయొచ్చు.

దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని అభిజిత్ మైండ్ గేమ్ ఆడి హారికను బాగా కన్ఫ్యూజ్ చేశాడు. ఆ తర్వాత వరసగా లాస్య, అరియనా, మోనాల్, అభిజిత్ లు అవుట్ అయ్యారు. ఫైనల్ గా మెహబూబ్, అఖిల్, సోహైల్ లు నిలిచారు. ఒకసారి సోహైల్ కెప్టెన్ గా చేసిన కారణంగా తనే స్వచ్చందంగా మెహబూబ్, అఖిల్ ల కోసం త్యాగం చేశాడు. దీంతో ఆ ఇద్దరు కెప్టెన్ షిప్ కోసం మాములుగా రెచ్చిపోలేదు. అప్పటిదాకా డీసెంట్ గా నడిచిన గేమ్ కాస్తా ఈ రచ్చ వల్ల పక్కదారి పట్టింది. వీళ్ళ ఓవర్ యాక్షన్ పీక్స్ కు చేరుకోవడంతో ఫైనల్ గా బిగ్ బాస్ వార్నింగ్ వచ్చి ఏకంగా టాస్కునే క్యాన్సిల్ కావడం పెద్ద ఝలక్

దెబ్బకు అసలు ఈ వారం మొత్తం కెప్టెన్ ఎవరూ ఉండరని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. ఇద్దరికీ డోస్ కూడా గట్టిగానే పడింది. ఉద్దేశపూర్వకరంగా చేసిన అతి వల్ల అందరి అవకాశాలను పోగొట్టేశారు. దీంతో అఖిల్ బాబుకి కోపం వచ్చి పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి రేంజ్ లో ఆగ్రహం ప్రదర్శించాడు. హగ్గులు ఇచ్చుకోవడం గురించి హారిక, అభిజిత్ చెప్పుకున్న ముచ్చట్లు కొత్త ప్రేమ కథకు దారి తీసేలా ఉన్నాయి. మొత్తానికి ఈ రోజుతో మరిన్ని కఠినమైన టాస్కులు ఉండబోతున్నాయన్న క్లూ అయితే ప్రోమోలో ఇచ్చాడు బిగ్ బాస్. నిన్నటితో ఐపిఎల్ పూర్తయ్యింది కాబట్టి ఇకనైనా ఈ షో రేటింగ్స్ లో మెరుగుదల ఉంటుందేమో చూడాలి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirKulisbetKulisbetMadridbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş