iDreamPost
android-app
ios-app

గోలగోల చేస్తున్న సభ్యులు – చిచ్చు పెట్టిన కోడిగుడ్లు

  • Published Nov 04, 2020 | 5:50 AM Updated Updated Nov 04, 2020 | 5:50 AM
  • Published Nov 04, 2020 | 5:50 AMUpdated Nov 04, 2020 | 5:50 AM
గోలగోల చేస్తున్న సభ్యులు – చిచ్చు పెట్టిన కోడిగుడ్లు

అసలు హౌస్ లో ఏం జరుగుతోందో నిజంగా బిగ్ బాస్ కు తెలుసో లేదో కానీ ఇరవై నాలుగు గంటల ఫుటేజీని గంటకు కుదించి అందులోనే ఏదైతే అతిగా అనిపించే రచ్చ ఉందో దాన్నే ఎడిట్ చేసి మరీ చూపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో. సభ్యులు రానురాను పూర్తిగా విచక్షణను కోల్పోతున్నారు. ఎంత గొడవ పడితే అంత పేరు పాపులారిటీ వస్తుందనుకున్నారు కాబోలు దానికి తగ్గట్టే ప్రవర్తిస్తున్నారు. మొన్న జరిగిన కోడిగుడ్ల పగలవేత ఏ రేంజ్ లో రాద్ధాంతం జరిగిందో చూసాంగా. నిన్న కూడా మాటల గొడవ యధావిధిగా కొనసాగింది. అభిజిత్, అమ్మ రాజశేఖర్ ల మధ్య వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారింది.

నిజానికి ప్రేక్షకుల్లో ఎంత నెగటివ్ ఇమేజ్ ఉన్నా ఎలాగోలా సేఫ్ అవుతూ వచ్చిన అమ్మ రాజశేఖర్ ఎందుకింత అతి చేస్తున్నారో మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న రీతిలో కొన్నిసార్లు మూర్ఖంగా వాదించడం కూడా లేనిపోని చిక్కులు తెస్తోంది. వీళ్ళు చాలక అవినాష్ కూడా దూరడంతో ఇక హద్దులు దాటేశారు. ఇక్కడ అమ్మ రాజశేఖర్ ఫైనల్ గా అభిజిత్ ని టార్గెట్ చేయడంతో హారిక రంగంలోకి దిగింది. ఏకంగా నోరు ముయ్యి అని మాస్టర్ తో వార్నింగ్ ఇప్పించుకుంది. కానీ ఆయన ఇలా నోరు పారేసుకోవడం మాత్రం టూ మచ్ అని చెప్పాలి. ఇంతాచేసి అమ్మనే అలగడం కొసమెరుపు.

హారిక తనవంతుగా వచ్చిన రెండో గుడ్డుని అమ్మ తలపై బాది రివెంజ్ తీర్చుకుంది. లాస్య అవినాష్ తలపై ఒకటి, మోనాల్ తలపై మరొకటి పగలగొట్టింది. మోనాల్ అవినాష్ సహాయంతో సోహైల్, లాస్యలకు కొట్టింది. రాజశేఖర్ మాస్టర్ అభిజిత్, అఖిల్ లపై గుడ్డు ప్రతీకారం తీర్చుకున్నారు. అఖిల్ మోనాల్ ని నామినేట్ చేయడం ఏదో అమెరికా ఎన్నికలు బిగ్ బాస్ హౌస్ లోనే జరుగుతున్నంత రేంజ్ లో బిల్డప్ ఇచ్చారు సభ్యులు. దెబ్బకు మోనాల్ మరోసారి మాతృదేవోభవ సినిమా చూపించేసింది. శోకాలు పెడుతూ సీరియల్ ఆర్టిస్ట్ తరహాలో రెచ్చిపోయి నటించేసింది. మొత్తంగా మళ్ళీ శనివారం ఎప్పుడు వస్తుందా అనేలా సాగింది నిన్నటి ఎపిసోడ్

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet