iDreamPost
android-app
ios-app

అందరూ సేఫ్ – తప్పిన ఎలిమినేషన్ గండం

  • Published Nov 30, 2020 | 6:39 AM Updated Updated Nov 30, 2020 | 6:39 AM
అందరూ సేఫ్ – తప్పిన ఎలిమినేషన్ గండం

మొన్న లీకైన ప్రచారాల్లో చెప్పినట్టే బిగ్ బాస్ 4లో ఈ వారం ఎవరూ ఎలిమినేట్ కాలేదు. డేంజర్ లో జోన్ లో ఉన్నట్టు కనిపించిన సభ్యులను వివిధ మార్గాల్లో సేఫ్ చేసి మెంబెర్స్ మరీ తగ్గిపోకుండా నిర్వాహకులు జాగ్రత్త పడ్డారు. ఈ విషయం ముందే తెలిసిపోయిన ప్రేక్షకులకు ఎగ్జైట్మెంట్ తగ్గిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే నాగార్జునను కూల్ చేసేందుకు సభ్యులంతా కలిసి ఆయన పాటలకు డాన్స్ చేసి మంచి హుషారు తెచ్చారు. అభిజిత్ కూడా పోటీ పడటం అన్నింటి కంటే హై లైట్. మొన్న తనను టార్గెట్ చేయడం పట్ల కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో నాగ్ ఇతన్ని స్పెషల్ గా పొగడటంతో ఫ్యాన్స్ ని కూల్ చేసినట్టు అయ్యింది.

ఇక కాసేపు డార్క్ రూమ్ కామెడీ మరోసారి జలజతో చేయించారు. మొన్న విపరీతంగా భయపడిన అరియనా ఈసారి నాగార్జున అభయంతో ధైర్యంగా వెళ్లి మూడు వస్తువులను పట్టేసింది. అవినాష్ మళ్ళీ ఓవర్ చేశాడు. అఖిల్, సోహైల్ లు కూడా భయం చూపించారు కానీ అందులో నటన తెలిసిపోయింది. నిన్న స్పెషల్ అట్రాక్షన్ గా కిచ్చ సుదీప్ రావడం హై లైట్ గా నిలిచింది. కన్నడలో ఏడు సీజన్లు నడిపించిన అనుభవం ఉన్న సుదీప్ ని నాగ్ ప్రత్యేకంగా అభినందించారు. దీనికి యాంకర్ గా చేయడం వల్ల చాలా ఓపిక ఒంటబట్టిందని ఈగ విలన్ చెప్పడం మరో ఆకర్షణ.

కాసేపు సుదీప్ హౌస్ ని తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. పార్టిసిపెంట్స్ ని సరదా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టాడు. ఇందులో కొన్ని ఇతర షోలలో చూసినట్టుగానే అనిపించాయి. ఇక నామినేషన్ల ప్రక్రియలో సుదీప్ అఖిల్ ని గండం నుంచి బయట పడేశాడు. దీనికి మోనాల్ ఎంత ఆనందపడిందో. ఇక మిగిలిన ఇద్దరిలో అవినాష్ కు తన పాస్ ఉపయోగించి అరియనాను సేవ్ చేసేలా మూడు ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ కాసేపు తతంగం జరిగి ఫైనల్ గా ఇద్దరూ సేవ్ అయ్యారని ప్రకటించారు నాగార్జున. ఇలాంటి పరిస్థితి వస్తుందనే అవినాష్ కు ముందే ఎవిక్షన్ పాస్ ఇచ్చినట్టు అనిపించడం సహజం. మొత్తానికి ఇంత హంగామా జరిగినా ఎవరూ బయటికి వెళ్ళకపోవడం కొసమెరుపు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş