iDreamPost
android-app
ios-app

లవ్ బర్డ్స్ రాజీ – ఎలిమినేషన్ వేళాయెరా

  • Published Oct 31, 2020 | 5:37 AM Updated Updated Oct 31, 2020 | 5:37 AM
లవ్ బర్డ్స్ రాజీ – ఎలిమినేషన్ వేళాయెరా

బిగ్ బాస్ 4కి మరో వీకెండ్ వచ్చేసింది. ఇవాళ రేపు కొత్త ఎలిమినేషన్లో ఎవరు బయటికి వెళ్ళబోతున్నారో తెలిసిపోతుంది. రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఖచ్చితంగా ఎవరనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. మొన్న అరియనా కెప్టెన్ గా మోనాల్ స్టోర్ రూమ్ మేనేజర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. నిన్న కొత్త సభ్యుడు ఎవరో వస్తారని బిల్డప్ ఇచ్చిన బిగ్ బాస్ ఆఖరికి అరియనాకు ఇష్టమైన చింపాంజీ బొమ్మను పంపడం పెద్ద కామెడీ. ఆ మాత్రం దానికి తను గుక్కపట్టి ఏడవడం, అవినాష్ ఓదార్చడం అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ కాలంలోని సహస్ర శిరచ్చేద చింతామణి నాటకాన్ని గుర్తుకు తెచ్చింది. అంత గొప్పగా పండించారు. ఇలాంటివే కృత్రిమంగా అనిపిస్తున్నాయి.

కెప్టెన్సి టాస్క్ గురించి అఖిల్-అభిజిత్ లు కలిసి కాసేపు డిస్కషన్ పెట్టుకున్నారు. అందులో భాగంగా సోహైల్. మహబూబ్ ల గురించి కూడా మాట్లాడుకున్నారు. ఇక ముక్కోణపు ప్రేమకథలో పావురాలు మోనాల్-అభిజిత్-అఖిల్ ల మధ్య కూడా కాసేపు ముచ్చట్లు సాగాయి. పరస్పరం నేను హర్ట్ చేయలేదంటే నేను చేయలేదంటూ ఒకరిమీద మరొకరు నిందలేసుకుని ఫైనల్ గా రాజీ మంత్రం ఆలపించారు. ఇదంతా అచ్చం టీవీ సీరియల్ మాదిరే సాగతీతలో నడిచింది. ఇరవై నాలుగు గంటల హౌస్ ప్రోగ్రాంని గంటకు కుదిస్తే అందులో ఇంతసేపు మోనాల్ ట్రాక్ కి ప్రాధాన్యం ఇవ్వడం చూస్తే బిగ్ బాస్ ఓటింగ్ వ్యవహారంపై అనుమానం రాకమానదు

ఈ రోజు నాగార్జునే యాంకర్ గా రావొచ్చని తెలిసింది. వైల్డ్ డాగ్ షూటింగ్ పూర్తి చేసుకుని నేరుగా ఇక్కడికే వచ్చినట్టు టాక్. ఇప్పుడు ఎవరిని సాగనంపుతారనే దాని మీదే అందరి దృష్టి నిలుస్తోంది. ముఖ్యంగా ప్రేక్షకుల్లో, సోషల్ మీడియాలో అమ్మ రాజశేఖర్ మీద తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతను అవసరానికి మించి ఓవర్ చేస్తున్నడని అధిక శాతం అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో మసాలా కోసం అతన్ని కొనసాగిస్తారా లేక ఇంకెవరినైనా బలి పెడతారా అనేది వేచి చూడాలి. అందులోనూ గత పది రోజులుగా ఇతను చాలా నెగటివ్ ఇంప్రెషన్ తెచ్చుకున్నాడు. సోహైల్, మెహబూబ్, హారిక, లాస్యలు స్ట్రాంగ్ నే ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş