iDreamPost
android-app
ios-app

చీకటి గదిలో చెడుగుడు – దెయ్యం జలజ దూకుడు

  • Published Nov 27, 2020 | 4:36 AM Updated Updated Nov 27, 2020 | 4:36 AM
చీకటి గదిలో చెడుగుడు – దెయ్యం జలజ దూకుడు

మొన్న జలజ దెయ్యాన్ని ప్రవేశపెట్టి కాస్త డిఫరెంట్ గా ట్రై చేసిన బిగ్ బాస్ దాన్ని నిన్న కూడా కొనసాగించాడు. వెరైటీ టాస్కుల్లో భాగంగా కంటికి కనిపించని జలజ ఇంట్లోని ప్లేట్లన్నీ మాయం చేసి కేవలం అరిటాకులను మాత్రమే వాడుకోవడానికి ఇచ్చింది. రాత్రంతా గార్డెన్ ఏరియాలో లాంతర్ పట్టుకుని నవ్వుతూ ఉండేందుకు ఎవరు ముందుకు వస్తారని సవాల్ విసిరింది. అవినాష్ ఆ సవాల్ ని స్వీకరించి మేలుకోవడమే కాదు కామెడీ కూడా చేశాడు. ఇక రాత్రి మొత్తం హౌస్ మేట్స్ పాడుకోనివ్వడకుండా చేయడమే టార్గెట్ గా పెట్టుకున్న జలజ దానికి తగ్గట్టే రకరకాలుగా భయపెట్టే ప్రయత్నం గట్టిగానే చేసింది.

ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అఖిల్ మళ్ళీ ఏడుస్తూ కనిపించాడు. ఎలిమినేషన్ దిగులు పట్టినట్టు అరియనా, సోహైల్, అవినాష్ లు చేసిన ఓదార్పు యాత్ర నుంచి అర్థమయ్యింది. ఇంగ్లీష్ లో అరియనాతో మాట్లాడినందుకు అభిజిత్ కు తలకిందులుగా వేలాడుతూ తెలుగు అక్షరాలు చెప్పే శిక్ష విధించింది జలజ. కష్టమైనా దాన్ని పూర్తి చేశాడు. ఇక వర్మ 12వ అంతస్తు సినిమా చూపిస్తూ అందులోలాగే మంచి హారర్ డ్రామాను ఇక్కడ సృష్టించారు. కన్ఫెషన్ రూమ్ కి ఒంటరిగా వెళ్లి స్పూన్ ని తెచ్చే టాస్కుకి అరియనా విపరీతంగా వణికిపోయింది. మోనాల్ మాత్రం ఏ మాత్రం తొణక్కుండా ధైర్యంగా పూర్తి చేసి డాన్స్ కూడా ఆడింది

ముందు తెగ బిల్డప్ ఇచ్చి రూమ్ లోకి వెళ్లిన సోహైల్ ఆ తర్వాత ఫుల్ గా దొరికిపోయాడు. ఇంతేనా నీ ప్రతాపం అనే తరహాలో హారిక అతన్ని ఫుల్ గా కవ్వించేసింది. అఖిల్, సోహైల్ లు చేసిన కామెడీ, యాక్షన్ మాములుగా పండలేదు. వీడియోలు చూపించవద్దని జలజను తెగ బ్రతిమిలాడుకున్నారు. జలజ దెయ్యం అటు హాస్యాన్ని ఇటు భయానక రసాన్ని సమానంగా పంచింది. దెయ్యం నిజం కాదని తెలిసినప్పటికీ వివిధ రూపాల్లో భయపెట్టిన విధానం పేలింది. ఈ రోజు వీకెండ్ లో చివరి రోజు. రేపు నాగార్జున ఎంట్రీతో ఎలిమినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. ఎవరు బయటికి వెళ్తారో ఇంకా లీక్ రాలేదు.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaMarsbahis GirişCasibom GirişMarsbahis GirişJojobet Giriş