iDreamPost
android-app
ios-app

అరియానా పెత్తనం – గొడవలదే రాజ్యం

  • Published Nov 03, 2020 | 5:44 AM Updated Updated Nov 03, 2020 | 5:44 AM
అరియానా పెత్తనం – గొడవలదే రాజ్యం

మొన్న ప్రారంభమైన కొత్త ఎలిమినేషన్ల ప్రక్రియ ఒక్క రోజుకే పీక్స్ కు వెళ్ళింది. డ్రామా శృతి మించుతోందన్న కామెంట్స్ ఎన్ని వస్తున్నప్పటికీ బిగ్ బాస్ లెక్క బెట్టేలా కనిపించడం లేదు. పైపెచ్చు ఎంత ఓవరాక్షన్ చేస్తే అంత సేఫ్ అన్న తరహాలో రోజు రోజుకి పార్టిసిపెంట్స్ ప్రవర్తన హద్దులు దాటేస్తోంది. ఇక విషయానికి వస్తే అమర ప్రేమ జంట మోనాల్ అఖిల్ ల మధ్య రొమాన్స్ మళ్ళీ మొదలయ్యింది. ఇద్దరు ఒకరికొకరు కాసేపు ముచ్చట్లు చెప్పుకుని హగ్గు కూడా ఇచ్చుకున్నారు. కాని ఇది తేడాగా ఉందని మోనాల్ చెప్పడంతో అఖిల్ అలాంటిదేమీ లేదని నాకు కొంత టైం కావాలని చెప్పి వెళ్ళాడు. డాన్స్ చేసే సమయంలోనూ ఇద్దరూ విడివిడిగా ఉండటం గమనార్హం.

ఇక కెప్టెన్ అరియానా గట్టిగానే పెత్తనం చేసింది ఈసారి. ఉదయాన్నే లేవనందుకు మెహబూబ్ కు నీళ్ళు పోసే పనిష్మెంట్ ఇచ్చింది. అంతే కాదు స్విమ్మింగ్ పూల్ విషయంలో ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది. ఇక సోహైల్ స్నానం విషయంలో ఓ రేంజ్ లో జీవించేశాడు. ఒకదశలో ఎదురు తిరిగి ఏం చేసుకుంటారో మీ ఇష్టం అన్నట్టు రెచ్చిపోయాడు. షూ లేస్ ఇష్యూలోనూ అరియానా సోహైల్ ల మధ్య వాగ్వాదం జరిగింది. తను హౌస్ లో, సోషల్ మీడియాలో నెగటివ్ ఇమేజ్ తో ఉన్న సంగతి మర్చిపోయి అమ్మ రాజశేఖర్ ఏ మాత్రం తగ్గకుండా ప్రవర్తిస్తున్నాడు. ఇంతకాలం సేఫ్ అవ్వడానికి ఇదే కారణం అనుకున్నారేమో మరి.

ఇప్పటికే రేటింగ్స్ వెనుకబడి వీక్ డేస్ లో కిందా మీద పడుతున్న బిగ్ బాస్ కు ఎంటర్ టైన్మెంట్ ని ఇంకెలా పెంచాలో అర్థం కావడం లేదు కాబోలు మొత్తం సభ్యులకే వదిలేసినట్టు కనిపిస్తోంది. రాను రాను అరుచుకోవడాలు ఎక్కువవుతున్నాయి. హారిక ముందు నుంచి ఇలాంటి వాటిలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ లాస్య సైతం ఇదే లీగ్ లో చేరిపోతోంది. ఓటింగ్ శైలికి భిన్నంగా తన స్క్రిప్ట్ ప్రకారమే బిగ్ బాస్ ఎలిమినేషన్లు చేస్తున్నాడన్న విమర్శలకు బదులు చెప్పాలంటే ఇది సరిపోదు. మరోవైపు వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గాయని మంగ్లీ రావోచ్చనే ప్రచారం జరుగుతోంది కానీ తను వచ్చే అవకాశాలు ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఉన్నాయి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet