iDreamPost
android-app
ios-app

అదుపు తప్పుతున్న అయ్యన్న పాత్రుడి నోరు

  • Published Jan 07, 2020 | 12:05 PM Updated Updated Jan 07, 2020 | 12:05 PM
అదుపు తప్పుతున్న అయ్యన్న పాత్రుడి నోరు

తెలుగుదేశం నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మరోసారి నోరు పారేసుకున్నారు. ముఖ్యమంత్రి వై.యస్ జగన్ తీసుకున్న పాలనా వికేంద్రికరణ నిర్ణయంపై తెలుగుదేశం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో మాట్లాడుతు ముఖ్యమంత్రిని అసభ్యపదజాలంతో దూషించారు. రాజధానిని మూడుగా విభజిస్తూ రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని జగన్ ప్రయత్నిస్తున్నాడని , ఏ పిచ్చొడైనా మూడు రాజాధానులు పెడతాడా, ఇలా చేస్తే పిచ్చినా కొడుకు అని కాక మరేమంటాం. 7 నెలలుగా రాష్ట్రములో పిచ్చోడు పరిపాలన జరుగుతుంది, మాములు తిక్కనా కొడుకు కాదు ఆడు, ఎవరు చెప్పినా వినడు అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పై అసభ్య పదజాలం వాడుతు ఇష్టానుసారం నోరు పారేసుకున్నారు.

తెలుగుదేశం నేతలు ఈ మధ్య వాడుతున్న భాష మరీ ఎబ్బెట్టుగా ఉంటుంది, సాక్షాత్తు తెలుగుదేశం అధినేత చంద్రబాబే అధికారులని పట్టుకుని వాడు, వీడు పనికిమాలిన వాడు అని మాట్లాడుతున్నారు. అధినాయకుడిని స్ఫుర్తిగా తీసుకుని బొండా ఉమా, చింతమనేని, అయ్యన్న లాంటి నేతల భాష కూడా అదుపు తప్పుతోంది. ముఖ్యంగా చింతకాయల అయ్యన్న పాత్రుడుకి నోరు పారేసుకోవటం కొత్తకాదు. గతంలో కూడా ముఖ్యమంత్రి జగన్ ని ఉద్దేశించి జగన్ రక్తంలో రౌడీ ఇజం ఉందని రౌడీ రాజ్యం.. కడప రెడ్లు.. అంటూ కులాలను, ప్రాంతాలను రెచ్చగొట్టేలా నోరు పారేసుకున్నారు. మహిళలను పట్టుకుని దుక్కలా ఉన్నారు పెన్షన్ కావాలా! మొగుడు ని రాచి రంపాన పెట్టుంటారు అందుకే పొయాడేమో అని అత్యంత అవమానకరంగా మాట్లాడారు. అయ్యన్న తన నోటి దురుసుని పొలీసులపై సైతం ఉపయోగించిన సందర్బాలు ఉన్నాయి. అయ్యన్న పాత్రుడి కొడుకు కూడా తండ్రికి తగ్గట్టే గతంలో దౌర్భగుడు చిరంజీవి అంటూ మాట్లాడిన వీడియోలు ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఇలా ప్రవర్తించినందుకు గత ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ది చెప్పినా నేతలు ఇంకా తమ పద్దతి మార్చుకున్నట్టు లేదు. ఇప్పటికైనా ప్రవర్తనా తీరు, వాడే భాషా మార్చుకోకపోతే ప్రజలే బుద్ది చెబుతారని గమనిస్తే మంచిది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomkarın ağrısına ne iyi gelirKulisbetKulisbetMadridbetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş