Idream media
Idream media
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ముస్లీంలకు ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలాన్ని కేటాయించాలని, వివాదాస్పద స్థలాన్ని రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగిస్తున్నట్లు సుప్రీం కీలక తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
”అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసిన మీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను. ప్రజలందరూ కూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను’’ అని జగన్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా తీర్పు నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివాదాస్పద ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసిన విషయం విదితమే.