iDreamPost
android-app
ios-app

భాగ‌మ‌తి.. అయ్యేనా మరో అరుంధ‌తి..

  • Published Jan 11, 2018 | 8:44 AM Updated Updated Jan 11, 2018 | 8:44 AM
భాగ‌మ‌తి.. అయ్యేనా మరో అరుంధ‌తి..

ఎప్పుడో విజ‌య‌శాంతి త‌రంతోనే వెళ్లిపోయిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు మ‌ళ్లీ ఊపిరి ఊదింది అనుష్కే. ఈమె న‌టించిన అరుంధ‌తి అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ రికార్డుల‌ను సైతం క‌దిలించింది. స్టార్ హీరోల సినిమాలు కూడా అనుష్క ముందు నిల‌వ‌లేక‌పోయాయి. అలాంటి హిస్ట‌రీ ఈమె సొంతం. ఆ త‌ర్వాత చాలా సినిమాలు చేసినా అందులో ఏ ఒక్క‌టి కూడా నిల‌బ‌డ‌లేదు. రుద్ర‌మ‌దేవి మాత్రం ప‌ర్లేద‌నిపించింది. ఇకిప్పుడు మ‌రోసారి అరుంధ‌తి రేంజ్ మాయ చేయ‌డానికి వ‌స్తుంది అనుష్క‌. ఈమె న‌టించిన భాగ‌మ‌తి ట్రైల‌ర్ ఇప్పుడు యూ ట్యూబ్ ను షేక్ చేస్తుంది. విడుద‌లైన ఆరు గంట‌ల్లోనే 10 ల‌క్ష‌ల వ్యూస్ దాటిన ఈ ట్రైల‌ర్.. 18 గంట‌ల్లో 32 ల‌క్ష‌లకు చేరిపోయింది. ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఇంత రెస్పాన్స్ ఊహించ‌డం క‌ష్ట‌మే. కానీ అనుష్క క్రేజ్ తో అది సాధ్య‌మైంది. 

ఈ లెక్క చూస్తుంటే నిజంగానే భాగ‌మ‌తి అంద‌రి లెక్క‌లు సెట్ చేసేలా క‌నిపిస్తుంది. జ‌న‌వ‌రి 26న అనుష్క‌తో ఎవ‌రెవ‌రు పోటీ ప‌డ‌బోతున్నారో వాళ్ల‌ లెక్క‌లు తేల‌డం అయితే ఖాయం. ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత సినిమాను త‌క్కువగా అంచ‌నా మాత్రం వేయ‌లేం. ట్రైల‌ర్ చివ‌ర్లో ఎవరు పడితే వారు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా. లెక్కలు తేలాలి.. ఒక్కడ్నీ పోనివ్వనంటూ అనుష్క పలికిన డైలాగులు కేక పెట్టించాయి. ముఖ్యంగా ఆ గెట‌ప్ సినిమాపై అంచ‌నాలు పెంచేస్తుంది. మ‌రోసారి అరుంధ‌తి త‌ర‌హాలోనే రెచ్చిపోయింది అనుష్క‌. పిల్ల జ‌మీందార్ త‌ర్వాత హిట్ లేని అశోక్ భాగ‌మ‌తిని ఏ విధంగా తెర‌కెక్కించి ఉంటాడో అనే ఆస‌క్తి మొద‌లైంది. దానికితోడు ఈయ‌న గ‌త సినిమా చిత్రాంగ‌ధ కూడా దెయ్యం సినిమానే. మ‌రోసారి అలాంటి కాన్సెప్ట్ తోనే వ‌స్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. మ‌రి ఈ సారి ఏం మాయ చేసుంటాడో చూడాలి..!

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetcasibomcasibompokerklas giriş