iDreamPost
android-app
ios-app

రీ షూట్ తో లేట్ అవుతున్న శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ.

రీ షూట్ తో లేట్ అవుతున్న శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ.

సారంగదరియా పాట హిట్ తో శేఖర్ కమ్ముల కొత్త చిత్రం లవ్ స్టోరీ పై అంచనాలు భారీగా పెంచేసింది. ఈపాట యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చింది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్,టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అన్ని సెట్ అయి సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

కానీ ఇంతలో ఏమైందో తెలియదు కానీ ఈ చిత్రంలోని సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలను మళ్లీ చిత్రీకరించాలని డైరెక్టర్ శేఖర్ కమ్ముల భావిస్తున్నాడని తెలుస్తోంది. అందుకే ఈ సినిమాలోని కొన్ని సీన్లు రీషూట్ కోసం టీం నిజామాబాద్ వెళ్తుందని తెలుస్తోంది. రీ షూట్ చేసుకొని ఎడిటింగ్ పూర్తి చేసుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుందో ఇంకా చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రాలేదు.
అందుకని మూవీ విడుదల కావడానికి సమయం పడుతుందని తెలుస్తోంది. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టుగా సమాచారం.

మరోవైపు ఇదే టైంలో చాలా సినిమాలు ఓటిటిలో విడుదల కావడంతో లవ్ స్టొరీ వాయిదా పడిందని అనుకుంటున్నారు. మరోవైపు ఆంధ్రలో థియేటర్లలో టికెట్ల రేట్లు పెంపు సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదు. త్వరలో చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దల బృందం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి ఈ సమస్యపై చర్చించే అవకాశం ఉండడంతో ఇది కూడా లవ్ స్టోరీ సినిమా పోస్ట్ పోన్ కు కలిసొచ్చిందని యూనిట్ భావిస్తోంది.

అక్కినేని నాగచైతన్య సాయి పల్లవిల మధ్య లవ్ స్టోరీని శేఖర్ కమ్ముల ఎలా తీసారో అని యూత్ వెయిట్ చేస్తోంది. ఫిదా లాగా ఇది కూడా గ్రామీణ నేపథ్యంలో జరిగే సినిమా అని టాక్ రావడంతో శేఖర్ కమ్ములకు మరో హిట్ ఖాయం అంటున్నారు. ఏదేమైనా ఇది ఒక మంచి చిత్రమని విడుదలైన తర్వాత అందరికీ నచ్చుతుందని దర్శకుడు శేఖర్ కమ్ముల సారంగదరియా పాట విడుదల సందర్భంగా తెలిపారు.అందుకే ప్రేక్షకుల అంచనాలకు సరిపోయేలా ఉండేందుకే కొన్ని సీన్లు రీషూట్ చేస్తున్నాడట. ఫిదా సినిమాలో చూపించిన లవ్ స్టోరీ కి ఫిదా అయిన తెలుగు ప్రేక్షకులు ఈ లవ్ స్టోరీ కి ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.

Also Read: వినాయక చవితితో హ్యాట్రిక్ పక్కా అంటున్న శృతిహాసన్

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet Girişjojobetcasibom girişholiganbet girişholiganbetvaycasinomarsbahis giriş