iDreamPost
android-app
ios-app

Summer Holidays స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ఖరారు

Summer Holidays స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ఖరారు

ఏపీలో పాఠ‌శాల విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు మే 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు ఏపీ విద్యాశాఖ శనివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం జులై 4వ తేదీ నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది.

కరోనా కారణంగా రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడానికి విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పదో తరగతి పరీక్ష‌లు ఈ నెల 27 నుంచి మే 9 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ఈ పరీక్షలు పూర్తవగానే సమ్మర్ హాలీడేస్ ప్రారంభం కానున్నాయి.

ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు సమ్మేటివ్-2 పరీక్షలను ఏప్రిల్ 22 నుంచి మే 4 వరకు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప‌రీక్ష‌లు పూర్తి కాగానే వారికి వేస‌వి సెలవులు ప్రకటించనున్నారు. వేసవి సెలవుల అనంతరం జూలై 4 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఇక జూనియర్‌ కాలేజీలకు మే 25 నుంచి జూన్‌ 20 వరకు వేసవి సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణ‌యించింది.

రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈసారి మార్చి నెల నుంచే సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండల తీవ్రత కారణంగా ఇప్పటికే ఒంటిపూట బడులు నిర్వహిస్తోంది ప్రభుత్వం.

సాధారణంగా జూన్‌ నెలలో విద్యా సంవత్సరం మొదలవుతుంది. జూన్‌ 12వ తేదీన పాఠశాలలను పునఃప్రారంభిస్తారు. అయితే కరోనా కారణంగా విద్యా వ్యవస్థ గాడితప్పింది. పబ్లిక్‌ పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ప్రారంభంలోనూ థర్డ్‌ వేవ్‌ వల్ల పిల్లల చదువులకు ఇబ్బంది ఏర్పడింది. అయితే కోవిడ్‌ ప్రభావం క్రమేపీ తగ్గడంతో రెండేళ్ల తర్వాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫలితంగా విద్యా సంవత్సరం నెల ఆలస్యంగా ప్రారంభం కాబోతోంది.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alMadridbetMadridbetMadridbetkatlaCasibom GirişMarsbahis GirişCasibom GirişcasinoroyalHoliganbet Giriş