iDreamPost
android-app
ios-app

సామాజిక స్పృహ కోల్పోయిన విపక్ష నేతలు ..

  • Published Dec 28, 2020 | 5:55 AM Updated Updated Dec 28, 2020 | 5:55 AM
సామాజిక స్పృహ కోల్పోయిన విపక్ష నేతలు ..

  • నీ కోటలో మరుగుదొడ్డి అంత లేవు ఇళ్ల స్థలాలు : టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ .
  • పేదలకు ఇచ్చే ఇంటి స్థలం జగన్ ఇంట్లో బాత్ రూమ్ అంత కూడా లేదు : టీడీపీ రాష్ట్ర అధక్షుడు అచ్చెన్నాయుడు .

  • జగన్ ఇచ్చే సెంటు స్థలంలో కుక్కలు కూడా నివాసం ఉండవు : సీపీఐ నాయకుడు నారాయణ .

పై ముగ్గురి స్టేట్మెంట్స్ కూడా ప్రతిపక్ష విధులేంటి, వాటి భాద్యతలు ఏంటీ, ఏ అంశం పై ఎలా స్పందించాలి, ప్రజల సమస్య ఏంటి , ఒక పథకంలో లోటుపాట్లు ఉంటే ప్రభుత్వంతో సంప్రదించి , పోరాడి , ఒత్తిడి తెచ్చి ప్రజలకు మేలు జరిగేట్లు ఎలా విధులు నిర్వర్తించాలి అన్న కనీస అవగాహనలేమితో , భాధ్యతారాహిత్యంతో చేసిన కామెంట్స్ తప్ప ప్రజల పక్షాన వారికోసం మాట్లాడినవి కావు అన్నది నిష్ఠుర సత్యం .

వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలందరికీ ఇళ్ళు ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలులో భాగంగా గత యాడాది కాలంలో ఎంపిక చేసిన దాదాపు 31 లక్షల మంది అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చేసిన 17 వేల ప్రాంతాల్లో 68 వేల ఎకరాలలో అభివృద్ధి చేసిన ప్లాట్స్ ని ఈ నెల 25 వ తారీఖు నుండి వచ్చే నెల 7 వ తారీఖు వరకూ ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టింది వైసీపీ ప్రభుత్వం .

సుమారు యాడాది క్రితం చేయవలసిన ఈ ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం స్థలాల సేకరణ , కొనుగోలు వంటి వాటితో కొంత ఆలస్యం కాగా , విపక్ష టీడీపీ సానుభూతిపరులు పలు చోట్ల ఉద్దేశ్యపూర్వక వివాదాలు సృష్టించి కేసులు వేసి గోల సృష్టించడంతో కొంత ఆలస్యం అయ్యిన విషయం అందరికీ తెలిసిందే. అంతిమంగా ఇళ్ల స్థలాల దరఖాస్తుదారుల ఎదురుచూపులు ఫలించి సంతోషంగా ఇళ్ల స్థలాల పట్టాలు అందుకొనే వేల ఆ స్థలాలను మరుగుదొడ్లతో , కుక్కల ఆవాసాలతో పోల్చటం వారికి బాధాకరమే కాదు , సభ్య సమాజానికి సైతం ఇలా పోల్చిన నాయకుల వ్యక్తిత్వం పట్ల అసహ్యం కలుగక మానదు .

కూడూ గూడూ గుడ్డ ప్రతి వ్యక్తి కనీస అవసరాలు. ఈ మూడిట్లో కూడూ , గుడ్డ నిత్యావసరం కాగా గూడు (ఇళ్ళు) స్థిరత్వాన్ని , రక్షణని , భద్రతా భావాన్ని ఇచ్చే శాశ్వతాధారం , స్థిరాస్తి . రెక్కాడితే డొక్కాడని కూలీ నుండి లక్షల జీతంతో వలస వెళ్లే ఉద్యోగి వరకూ తమ స్థాయి కొద్దీ శాశ్వత నివాసం కోసం కలలు కంటూ వాటి సాకారం కోసం కృషి చేస్తుంటారు. దురదృష్టవశాత్తు అవకాశాలు దొరక్క ఆ కలని సాకారం చేసుకోలేని సామాన్య ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధిక సహాయం చేస్తుంటాయి. వైసీపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి స్థలం ఇవ్వటంతో పాటు ఇల్లు కూడా నిర్మించి ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి పూనుకోవడం పేద ప్రజల అదృష్టంగా చెప్పవచ్చు .

ఇప్పుడు జగన్ ఇస్తున్న ఇళ్ల స్థలాల లబ్ధిదారులు వాటి సైజు భౌగోళిక రూపం తెలియకుండా తీసుకోవట్లేదు . వైసీపీ ప్రభుత్వం స్థల విస్తీర్ణం , నిర్మాణ నమూనా ప్రకటించాక వాటిని అంగీకరిస్తూ దరఖాస్తు చేసుకున్న తర్వాతే వారిలో అర్హులను ఎంపిక చేసి అందిస్తోంది ప్రభుత్వం. మరి తీసుకొంటున్న లబ్ధిదారులకు రాని మరుగుదొడ్డి , కుక్కల నివాసాల అనుభూతి లోకేష్ , అచ్చంనాయుడు , నారాయణలకు ఎందుకు వచ్చింది. ఈ వాఖ్యలు దురదృష్టకరం, అహంకార పూరితం అనుకోవడంతో సరిపెట్టుకొనేవి కావు . ప్రజలంటే లెక్కలేనితనం , సామాన్య జీవితాలంటే చిన్నచూపు , బలహీన వర్గాల పట్ల లెక్కలేనితనంగా పరిగణించవచ్చు .

తీసుకొంటున్న ముప్పై లక్షల మందిలో ఒక్కరికీ లేని అభ్యంతరం వీళ్ళకి మాత్రం ఎందుకు . వారికి లేని మరుగుదొడ్ల , కుక్కల దొడ్ల భావన వీళ్ళకి ఎందుకు . ఇన్నాళ్లు సెంటు స్థలంలో ఆవాసం ఏర్పరుచుకున్న వారు , ఇహ ముందు ఏర్పరుచుకొనే వారు మరుగు దొడ్లలో బతికే కుక్కల వంటి వారని వీరి ఉద్దేశ్యం కాబోలు . బడుగు బలహీన వర్గాల ప్రజల పట్ల ఇంతటి చిన్నచూపు ఉన్న వ్యక్తులని రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగించనివ్వడం ఆత్మహత్యాసదృశ్యం .

నిజంగా వీళ్ళకి సామాజిక స్పృహ ఉంటే , ప్రజల పట్ల బాధ్యత ఉంటే , ప్రస్తుతం ఇళ్ల స్థలాలు అందుకొంటున్న లబ్ది దారులకు ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి మాట్లాడాలి . ముందు ఆ లబ్దిదారులతో చర్చించి వారి సమస్యలు ఏంటో తెలుసుకోవాలి. ఆ తదుపరి స్థల విస్తీర్ణం చాలదని వారు చెబితేనో , అందులో కట్టడానికి నిర్ణయించిన డిజైన్ లో లోపాలున్నా , గదుల విస్తీర్ణం నివాస యోగ్యం కాకపోయినా వాటి గురించి ప్రభుత్వం దృష్టికి , మీడియా దృష్టికి తీసుకురావడం , మెరుగైన వసతుల కోసం డిమాండ్ చేయడం , ప్రభుత్వంతో చర్చించి ఆ సమస్యలు తీర్చే ప్రయత్నం చేసి వారికి న్యాయం చేయడం లాంటి చర్యలు విపక్షాల బాధ్యత .

అది మరచి రాష్ట్ర ప్రజలందరి సొత్తయిన ప్రజాధనంతో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్లిస్తున్న ప్రభుత్వం పై అక్కసుతో ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వాన్ని , లబ్దిదారులనే కాదు , సుపరిపాలన కోసం , సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆధారభూతమైన రాష్ట్ర ప్రజలందర్నీ అవమానించినట్లే …

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbetHoliganbet Giriş