iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ పోలీసు బాస్ బదిలీ అయ్యారు. త్వరలో కొత్త డీజీపీ నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి నియమితులయ్యారు. ఆయనకి అదనపు బాధ్యతగా అప్పగించారు. 2023 జూలై వరకూ సవాంగ్ పదవీకాలం ఉంది. ప్రస్తుతం ఆయన్ని జిఏడిలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి.
కసిరెడ్డి విఆర్ఎన్ రెడ్డి వైజాగ్ సీపీగా పనిచేశారు. అక్కడి నుంచి 2020లో ఇంటెలిజెన్స్ చీఫ్ అయ్యారు. నిజానికి స్టీఫెన్ రవీంద్ర కోసం ఎదురుచూసినప్పటికీ కేంద్రం నుంచి డిప్యుటేషన్ ప్రక్రియ పూర్తికాకపోవడంతో రాజేంద్రనాథ్ రెడ్డి ని నియమించారు. ఆయన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ముక్కుసూటిగా ఉంటారని పేరు. ప్రస్తుతం అడిషనల్ ఛార్జ్ గా ఆయనకి ఈ బాధ్యత అప్పగించారు.
Also Read:సీఎం ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ బదిలీ
జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే గౌతమ్ సవాంగ్ పూర్తిస్థాయిలో డీజీపీగా నియమితులయ్యారు. రెండున్నరేళ్లుగా కీలకపాత్ర పోషించారు. వివిధ సంస్కరణలు అమలుచేశారు. రాష్ట్రంలో క్రైమ్ రేట్ అదుపులో ఉంచారు. జగన్ ప్రభుత్వ విధానాల అమలులో పోలీస్ యంత్రాంగం చొరవ చూపేందుకు డీజీపీ ముఖ్య భూమిక పోషించారు. ముగ్గురు సీఎస్ లు మారినప్పటికీ డీజీపీ మాత్రం కొనసాగారు. అయితే ప్రస్తుతం. ఆయన బదిలీ ఆసక్తిగా మారింది. అయితే జగన్ టీమ్ రెండున్నరేళ్ల తర్వాత మార్పు ఉంటుందని ప్రకటించిన తరుణంలో ఈ మార్పు అందులో భాగంగానే అని చెబుతున్నారు.
జగన్ టీమ్ మార్పులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కొందరు భావిస్తున్నారు. మరింతమందికి బదిలీలు ఉంటాయని చెబుతున్నారు. కీలకస్థానాల్లో ఉన్నవారికి సైతం స్థానభ్రంశం అనివార్యంగా కనబడుతోంది