iDreamPost
android-app
ios-app

బిగ్‌బాస్‌ లో అనసూయ.. వరుస ప్రశ్నలతో అదిరిపడ్డ కంటెస్టెంట్స్..

  • Published May 13, 2022 | 7:55 PM Updated Updated May 13, 2022 | 7:55 PM
  • Published May 13, 2022 | 7:55 PMUpdated May 13, 2022 | 7:55 PM
బిగ్‌బాస్‌ లో అనసూయ.. వరుస ప్రశ్నలతో అదిరిపడ్డ కంటెస్టెంట్స్..

గత అయిదు సీజన్లుగా టీవిలో టెలికాస్ట్ అయిన బిగ్‌బాస్‌ ఇప్పుడు హాట్ స్టార్ ఓటీటీలో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే టీవీలో వచ్చినంత క్రేజ్ మాత్రం ఓటీటీలో రావట్లేదు అనే చెప్పాలి. బిగ్‌బాస్‌ అభిమానులు, అందులో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్స్ అభిమానులు తప్ప బిగ్‌బాస్‌ని ఎక్కువగా ఎవరూ పట్టించుకోవట్లేదు ఈ సారి. దీంతో షోకి హైప్ తీసుకు రావడానికి ప్రతి వారం ఎవరో ఒక సెలబ్రిటిని తీసుకొస్తున్నారు. గతంలో ఎప్పుడో ఒకసారి సెలబ్రిటీలు వచ్చేవారు. కానీ ఈ సారి మాత్రం సెలబ్రిటీలు, సినిమా ప్రమోషన్స్ కోసం హీరోలు, హీరోయిన్లు వరుసగా బిగ్‌బాస్‌ కి వస్తున్నారు. ఇలా షోకి హైప్ తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు నిర్వాహకులు.

తాజాగా అనసూయ బిగ్‌బాస్‌ కి రాగా ఆ ప్రోమో రిలీజ్ అయింది. అయితే అనసూయ వచ్చి ప్రేక్షకుల తరపున అంటూ కొన్ని ప్రశ్నలతో అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ లని కంగారు పెట్టేసింది. మొదట అరియానాకు ఆడియన్స్‌ అడిగారంటూ.. ఫ్యామిలీ వీక్‌ తర్వాత బిందుకు క్లోజ్‌ అయ్యావు? ఎందుకు ఉమెన్ కార్డు వాడుతున్నావు? సడన్‌గా ఎందుకిలా మారిపోయావు? అని ప్రశ్నించింది. దీంతో అరియానా ఏం చెప్పాలో తెలియక ఇందులో ఉమెన్‌ కార్డు వాడను అనుకుంటే మీకే వదిలేస్తున్నా అని చెప్పింది.

ఇక బిందు మాధవిని ప్రశ్నిస్తూ.. ఎప్పుడూ గ్రూప్‌ గేమ్స్‌ నువ్వు ఆడుతావు, కానీ అఖిల్‌ గ్రూప్‌ గేమ్స్‌ ఆడతాడని అంటావు, ఎందుకు? అని అడగడంతో నేనెప్పుడూ గ్రూప్ గేమ్ ఆడలేదు అని బిందు చెప్పింది.

ఆ తర్వాత అఖిల్‌ ని.. వెకేషన్‌ను ఎలా ఎంజాయ్‌ చేస్తున్నారు? గత వారం రోజులుగా బిందు గురించి నెగెటివ్‌గా మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఫ్యామిలీ వీక్‌ తర్వాత బిందుతో మంచిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నావు, ఎందుకు? అని అడిగింది.

ఇక యాంకర్ శివతో.. ఎలా అనిపిస్తోంది? అడిగే దగ్గర నుంచి అడిగించుకునే దాకా వచ్చావు? అని అడగడంతో అందరూ నవ్వేశారు. మరి మిగిలిన వాళ్ళని అనసూయ ఏం ప్రశ్నలు అడిగింది? వాళ్ళు ఏం సమాధానాలు ఇచ్చారు అని తెలుసుకోవాలంటే ఓటీటీలో ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio