iDreamPost
android-app
ios-app

బోయ గిరిజమ్మ జెడ్పీ చైర్మన్ కావటానికి నాటి పసుపు కుంకుమ పోరాటమే కారణమా?

బోయ గిరిజమ్మ జెడ్పీ చైర్మన్ కావటానికి నాటి పసుపు కుంకుమ పోరాటమే కారణమా?

ఏపీలోని అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు వైసీపీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే నూతనంగా ఎన్నికైన కొందరు జిల్లా పరిషత్ చైర్మన్లు ఎవరా? అని కొందరు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఒకటైన అనంతపురం జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ గా బోయ గిరిజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె బోయ సామాజిక వర్గానికి చెందిన వారు.

అనంత జెడ్పీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే పార్టీకి ఓటర్లు పట్టం కట్టడంతో ప్రతిపక్షాలకు కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేదు . అనంత మొత్తం మీద 62 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 60 స్థానాలను వైసీపీ అభ్యర్థులే కైవసం చేసుకున్నారు. మడకశిర నియోజకవర్గం పరిధిలోని అగళి జెడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి ఉమేష్‌ విజయం సాధించారు. అలాగే అమరాపురం నుంచి స్వతంత్ర అభ్యర్థి అనంతరాజు గెలిచారు.

Also Read:ఆ ఒకే ఒక జెడ్పీటీసీ ఇండిపెండెంట్ ఎలా గెలిచాడు?

అనంతపురం జెడ్పీ ఛైర్మన్‌ పదవి ‘బీసీ మహిళ’కు రిజర్వు కావడంతో బీసీ వర్గానికి చెందిన ముగ్గురు మహిళలు పోటీ పడ్డారు, అయితే నామినేషన్‌ దాఖలు చేసే ముందే అధిష్ఠానంతో హామీ తీసుకున్న బోయ గిరిజమ్మ ఛైర్మన్‌ పదవి దక్కించుకున్నారు. అలాగే జిల్లాలో జెడ్పీ కో-ఆప్షన్ సభ్యులుగా ఫయాజ్ వలి, అహ్మద్ భాషా ఎన్నికయ్యారు. ఆత్మకూరు జెడ్పీటీసీ బోయ గిరజమ్మను అధ్యక్షురాలిగా కనగానపల్లి జెడ్పీటీసీ గౌని మారు తిప్రసాద్‌, గోరంట్ల జెడ్పీటీసీ జయరాం నాయక్‌లు ప్రతిపాదించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఒకే ఒక నామినేషన్‌ దాఖలవడంతో బోయ గిరిజమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కలెక్టరు ప్రకటించారు. తర్వాత ఉపాధ్యక్ష పదవికి నార్పల జెడ్పీటీసీ నాగరత్నమ్మ ఎన్నికయ్యారు.

ఇక బోయ గిరిజమ్మ విషయానికి వస్తే ఆమె పుట్టిన ఊరు గార్లదిన్నె మండలం కృష్ణాపురం కాగా వివాహం అయ్యాక పామిడి మండలం వంకరాజుకాలువకు వచ్చారు. ఇక ఆమె 2014 నుంచి 2019 వరకు అనంతపురం 3వ డివిజన్‌ కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు. అలాగే అదే సమయంలో ఆమె ఫ్లోర్‌ లీడర్‌ గా కూడా పని చేశారు. ఇక వైసీపీ మహిళా విభాగంలో చాలా యాక్టివ్ గా ఉండే గిరిజమ్మ అనంతపురం పార్లమెంటు వైసీపీ అధ్యక్షురాలిగా కూడా వ్యవహరించారు.

Also Read : విశ్వాసానికి అందలం.. దళిత మహిళా నేతకు జెడ్పి పదవి

2019లో మంత్రి హోదాలో పరిటాల సునీతా అధికారదర్పంతో “పసుపు కుంకుమ” పేరుతొ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సొంత ఊరు తోపుదుర్తి పర్యటనకు రావటానికి ప్రయత్నం చేయగా గిరిజమ్మ నాయకత్వంలో డ్వాక్రా మహిళలు తవకు చెల్లించావలసిన వడ్డీని ఎగ్గొట్టి పసుపుకుంకుమ పేరుతో మోసం చేస్తున్నారని ధర్నా చేశారు . సునీత పోలీసుల సహాయంతో డ్వాక్రా మహిళలను అక్కడి నుంచి తొలగించాలని చేసిన ప్రయత్నాన్ని గిరిజమ్మ తీవ్రంగా ప్రతిఘటించారు. గిరిజమ్మ నాయకత్వ లక్షణాలు,పోరాటం గురించి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి చెప్పటంతో ఆమెకు ప్రత్యేక గుర్తింపు దక్కింది.

Also Read : త్యాగానికి జగన్ పట్టం : కడప జెడ్పీ చైర్మన్ గా ఆకేపాటి

జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అవకాశాలు రాని వారికి పెద్దపదవులు ఇవ్వాలన్న ఆలోచనకు అనుగుణంగా అనంతపురం చరిత్రలో అప్పటి వరకు బీసీ మహిళా జెడ్పీ చైర్ పర్సన్ గా పనిచేసిఉండకపోవటంతో గిరిజమ్మకు జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వాలని ప్రకాష్ రెడ్డి సీఎం ను అడగటంతో దానికి జగన్ అంగీకరించారు.

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన సొంతమండలం ఆత్మకూరునుంచి గిరిజమ్మను పోటీచేయించి 11000 భారీ మెజారిటీతో గెలిపించారు. జగన్ ఇచ్చిన మాట ప్రకారం గిరిజమ్మను జెడ్పీ చైర్మన్ చేశారు. ఆవిధంగా గిరిజమ్మ  తొలి బీసీ మహిళా జెడ్పీ చైర్మన్ అయ్యారు.

Also Read : ఆ “తెగ”కు తొలిసారి జిల్లాస్థాయి పదవి