అమరావతి భూముల కుంభకోణంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్ వి రమణ కుమార్తెలు కేసులో ఇరుక్కోవడం కీలకంగా మారింది. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ప్రధాన నిందితుడుగా ఉన్న కేసులో జస్టిస్ రమణ కుమార్తెలు ఏ 10,ఏ 11 గా ఉన్నారు. వారి పేర్లను ఎఫ్ ఐ ఆర్ లో నమోదు చేశారు.
Also Read:అమరావతి కుంభకోణం: మాజీ ఏజీ దమ్మాలపాటిపై ఏసీబీ కేసు
ఐపీసీ 409,420 సెక్షన్ల కింద ఏసీబీ నమోదు చేసిన కేసులో నూతలపాటి శ్రీతనుజ, నూతలపాటి శ్రీభువన పేర్లు ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. న్యాయవస్థలో కీలక స్థానంలో ఉన్న రమణ కుటుంబ సభ్యులే భారీ కుంభకోణంలో భాగస్వామ్యులు అయినట్లు ఏసీబీ కేసు నమోదు చేయటంతో ఇటు రాజకీయ, అటు న్యాయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
Also Read:టీడీపీ శిబిరంలో కొత్త చిచ్చు, ఏసీబీ కేసుల్లో ఎవరి కొంపకొల్లేరవుతుందో?
కాగా ఇదే కేసులో మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హౌస్‌మోషన్ పిటిషన్ తో హైకోర్టు ని ఆశ్రయించారు. మిగి5 12మంది నిందితుల విషయంలో ఏసీబీ ఎలా స్పందిస్తుందన్నది ప్రధానాంశంగా మారింది.