iDreamPost
android-app
ios-app

నిర్మాతగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫస్ట్ సినిమానే షారుక్ తో కలిసి..

  • Published May 25, 2022 | 7:25 PM Updated Updated May 25, 2022 | 7:25 PM
నిర్మాతగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఫస్ట్ సినిమానే షారుక్ తో కలిసి..

ప్రస్తుతం బాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉంది స్టార్ హీరోయిన్ అలియాభట్. వరుస సినిమాలతో వరుస విజయాలు సాధిస్తుంది. ఇటీవలే RRR , గంగూభాయ్ కతీయవాడి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి ప్రేక్షకులను అలరించింది అలియాభట్. ఇన్నాళ్లు హీరోయిన్ గా మెప్పించిన అలియా తాజాగా నిర్మాతగా మారింది.

అలియాభట్ ఇటీవల ఎటర్నల్ సన్ షైన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. ‘డార్లింగ్స్’ అనే టైటిల్ తో తన మొదటి సినిమాని నిర్మిస్తుంది. ఇందులో తల్లీకూతుళ్ల అనుబంధాన్ని వినోదం, సస్పెన్స్, ఎమోషన్స్ తో కలిపి చూపించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని అలియాభట్ నిర్మించడమే కాకుండా ఇందులో నటిస్తుంది కూడా. ఈ సినిమాలో కూతురి పాత్రలో అలియాభట్ నటిస్తుంది. ఈ సినిమాకి జష్మీత్‌ కీ రీన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ సినిమా నిర్మాణంలో షారుఖ్ ఖాన్ కూడా భాగమయ్యాడు. మొదటి సినిమానే షారుక్ తో కలిసి నిర్మిస్తుంది అంటే అలియా గ్రాండ్ గానే ప్లాన్ చేస్తుంది. షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, అలియా భట్ నిర్మాణ సంస్థతో కలిసి ఈ డార్లింగ్స్ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. డార్లింగ్స్ సినిమా గురించి తాజాగా అలియాభట్ మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాతగా ఇది నా తొలి సినిమా కాబట్టి నా కెరీర్‌లో చాలా స్పెషల్ అని భావిస్తున్నాను. డార్లింగ్స్ సినిమాలో వినోదం పండిస్తూనే ఎమోషన్స్, సస్పెన్స్‌, థ్రిల్లర్‌ అంశాలు కూడా అందించబోతున్నాం అని తెలిపింది.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet