iDreamPost
android-app
ios-app

రహస్య గదిలో అఖిల్ – లేఖలు పంచిన ఎమోషన్

  • Published Nov 13, 2020 | 5:53 AM Updated Updated Nov 13, 2020 | 5:53 AM
రహస్య గదిలో అఖిల్ – లేఖలు పంచిన ఎమోషన్

బిగ్ బాస్ 4 ఈ షో వీరాభిమానులు కోరుకున్నట్టే సాగుతోంది. మొన్న జరిగిన ఎపిసోడ్లో సినిమా రేంజ్ డ్రామాను ఆడించి అఖిల్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపించిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరుగుతోందని తనకు లేని బిల్డప్ ఇచ్చే క్రమంలో చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ ఇదేమి పట్టనట్టు తాము అనుకున్న రీతిలో చేస్తున్నారు నిర్వాహకులు. నిన్నటి ఎపిసోడ్ లో కూడా దీన్ని హై లైట్ చేయడం మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. అభిజిత్, సోహైల్,. మెహబూబ్ లు అఖిల్ ని రహస్య గదిలో పంపడం గురించి ఓ రేంజ్ లో డిస్కస్ చేసుకున్నారు. అందులో మంచి చెడ్డలను, ఏదైనా మోసం జరిగిందా అనే కోణాన్ని వాళ్ళ వాళ్ళ వెర్షన్లలో వినిపించేసుకున్నారు.

ఇక ఫ్రిడ్జ్ లో పెట్టిన మటన్ చెడిపోవడం పట్ల ఎవరో చనిపోయిన రేంజ్ లో సభ్యులు తెగబాధపడిపోయారు. హారిక కెమెరా ముందుకు వచ్చి ముద్దులు పెట్టి మరీ మరోసారి పంపమని బిగ్ బాస్ ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. అవినాష్ నేనేం తక్కువ తిన్నానా ఏకంగా పాట కూడా అందుకున్నాడు. మటన్ చెడిపోవడానికి కారణం తనే కాబట్టి అవినాష్ తన గుడ్లను అందరికీ ఇచ్చాడు. అరియానా సోహైల్ మెహబూబ్ లు స్విమ్మింగ్ పూల్ లో నానా రచ్చ చేశారు. ఇక మెంబెర్స్ కి కానుకలు ఇచ్చే అవకాశం బిగ్ బాస్ ఆఫర్ వల్ల అఖిల్ కు దక్కింది

కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన లేఖలను అందుకోవాలంటే ఎవరికీ తెలియని ఒక రహస్యాన్ని ఒక్కొక్కరు చెప్పాలనే కండిషన్ పెట్టారు. మెహబూబ్ తన జీవితంలో ఓ అమ్మాయి వల్ల పోలీస్ స్టేషన్ లో దెబ్బలు తినాల్సి వచ్చిన పార్కింగ్ ఎపిసోడ్ గురించి చెప్పుకున్నాడు. లాస్య మరోసారి తన అమరప్రేమకథలో మరో ట్విస్ట్ ని వినిపించింది. భర్త తనకన్నా ఏడాది చిన్నవాడని పైగా పెళ్లి చేసుకునే టైంకి చాలా పేదవాడని చెప్పుకొచ్చింది. హారిక తన నాలుగు సంవత్సరాల బ్రేకప్ లవ్ స్టొరీని చెప్పింది. అమ్మ పంపిన లెటర్ ను చదవగానే యధావిదిగా కన్నీళ్ళ ట్యాప్ ఓపెన్ చేసింది. ఇలా సాగుతోంది వ్యవహారం

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş