iDreamPost
android-app
ios-app

బ్యాచిలర్ గా అఖిల్ : అఫీషియల్

  • Published Feb 04, 2020 | 12:00 PM Updated Updated Feb 04, 2020 | 12:00 PM
బ్యాచిలర్ గా అఖిల్ : అఫీషియల్

గత కొన్ని నెలలుగా అక్కినేని అభిమానులను సస్పెన్స్ లో ఉంచుతూ వచ్చిన అఖిల్ 4వ సినిమా టైటిల్ ని అధికారికంగా ప్రకటించారు. గత రెండు రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పేరునే కన్ఫర్మ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. అఖిల్ రూపానికి, వయసుకి, ఇమేజ్ కి ఇది యాప్ట్ టైటిల్ అని చెప్పొచ్చు. గతంలో తాతయ్య అక్కినేని నాగేశ్వర్ రావు గారు బ్రహ్మచారిలో నటించారు. అది మంచి హిట్ మూవీ.

నాగార్జున ఇలాంటి పేరుని ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు అఖిల్ దాన్నే ఇంగ్లీష్ లో వాడుకుంటూ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఇచ్చేశాడు. ఇప్పటిదాకా అఖిల్-హలో-మిస్టర్ మజ్నులలో నటించిన అఖిల్ ని విజయం ఇంకా వరించనే లేదు. ఇప్పుడీ సినిమాతో అది తీరుతుందని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్న మాట. బొమ్మరిల్లు రూపంలో మొదటి సినిమాతోనే అదిరిపోయే బ్లాక్ బస్టర్ తో అందరిని ఆకట్టుకున్న భాస్కర్ దీనికి దర్శకత్వం వహించడం ఆసక్తి రేపుతోంది.

గత కొంతకాలంగా ఇతను చెప్పుకోదగ్గ ఫాంలో లేనప్పటికీ కథలో విషయం ఉంటే తప్ప ఒప్పుకోని గీతా ఆర్ట్స్ నిర్మాణంలో వస్తోంది కాబట్టి ఆ రకంగా దీని మీద పాజిటివ్ ఫీలర్స్ ఉన్నాయి. గత రెండేళ్ళుగా స్టార్ల తో హిట్ల మీద హిట్లు కొడుతున్న పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తుండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. గోపి సుందర్ సంగీతం మీద కూడా అంచనాలున్నాయి. ఏప్రిల్ లో విడుదల కానున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మీద అంచనాలైతే భారీగానే ఉన్నాయి. ప్రమోషన్ లో భాగంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫస్ట్ స్టెప్ ని ఈ నెల 8న వదలబోతున్నట్టు ప్రకటించారు. అది టీజరా లేక ఫస్ట్ లిరికల్ వీడియోనా అనేది మాత్రం చెప్పలేదు. సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హంగామా ఇక షురూ అయినట్టే.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomiptv satın alluxbetluxbetRulobetkatlaJojobet GirişJojobet GirişMarsbahis GirişCasibom GirişMarsbahis Giriş