iDreamPost
android-app
ios-app

పదేళ్ల తర్వాత వేణు రీ ఎంట్రీ

  • Published Jul 07, 2022 | 1:27 PM Updated Updated Jul 07, 2022 | 1:27 PM
పదేళ్ల తర్వాత వేణు రీ ఎంట్రీ

స్వయంవరంతో పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన వేణు తొట్టెంపూడి గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికీ చిరునవ్వుతో ఎందరికో ఫేవరెట్ మూవీ. హనుమాన్ జంక్షన్ వచ్చినప్పుడల్లా టీవీలో చూసిన ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూస్తూనే ఉంటాయి. పెళ్ళాం ఊరెళితే, పెళ్ళాంతో పనేంటి లాంటి మంచి సినిమాలు చేశాక వరస ఫ్లాపులొచ్చి వేణు మాయమైపోయాడు.

తిరిగి 2012లో దమ్ములో కనిపించాడు కానీ అది ఆడకపోవడంతో తిరిగి కనిపించకుండా పోయాడు. కట్ చేస్తే ఇప్పుడు 2022లో రామారావు ఆన్ డ్యూటీతో పోలీస్ ఆఫీసర్ గా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడమే కాదు వేణుతో మీడియాకు డైరెక్ట్ ఇంటర్వ్యూలు ఇప్పిస్తోంది సినిమా టీమ్. అతని కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఇదేదో మంచి కంబ్యాక్ అయ్యేలా ఉందని ఫ్యాన్స్ నమ్మకం.

కాకపోతే దమ్ము తరహాలో చనిపోయే క్యారెక్టర్ కాకపోతే బెటర్. సీరియస్ గా ఫోకస్ చేయలేదు కానీ వేణు ఇక్కడే స్థిరపడితే మంచి అవకాశాలు వస్తాయి. శ్రీకాంత్, జగపతిబాబు, సాయిచంద్, శ్రీరామ్, వెంకట్, శ్రీకాంత్ లాంటి హీరోలు సెకండ్ ఇన్నింగ్స్ ని చక్కగా సెట్ చేసుకుంటున్నారు. మంచి టాలెంట్ ఉన్న వేణు కూడా ఈ కోణంలో దృష్టిలో మనకో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ దొరికినట్టే. చూద్దాం.

gamdomCasibommarsbahis girişMarsbahisJojobet Girişjojobetjojobet giriş