iDreamPost
android-app
ios-app

ఆర్మీలో చేరాలనుకునేవారికి అడివి శేష్ కీలక ప్రకటన..

  • Published Jun 05, 2022 | 7:00 PM Updated Updated Jun 05, 2022 | 7:00 PM
  • Published Jun 05, 2022 | 7:00 PMUpdated Jun 05, 2022 | 7:00 PM
ఆర్మీలో చేరాలనుకునేవారికి అడివి శేష్ కీలక ప్రకటన..

మనలో చాలామందికి దేశభక్తితో ఆర్మీలో చేరాలని ఉంటుంది, ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని ఉంటుంది. కానీ దానికి సరైన గైడెన్స్, దానిపై అవగాహన మనలో చాలా మందికి తక్కువ. దీంతో తాజాగా ఆర్మీలో చేరాలనుకునే వారికోసం అడవి శేష్ ఒక కీలక ప్రకటన చేశారు. జూన్ 3న మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడవి శేష్ హీరోగా తెరకెక్కించిన మేజర్ సినిమా థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయాన్ని సాధించి హిట్ టాక్ తో ముందుకెళ్తుంది.

తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో అడివి శేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది ఆర్మీలో జాయిన్ అవుతామంటూ మెసేజ్ లు చేస్తున్నారు. అలాగే మన దగ్గర చాలా మందికి ఆర్మీలో జాయిన్ అవ్వడానికి సరైన అవగాహన లేదు. అందుకే సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఆర్మీలో చేరదాం అనుకునే వారికీ మా వంతు కృషి చేయడానికి నిర్ణయం తీసుకున్నాము.

మొదట పది మంది యువకులతో ఈ ప్రయత్నాన్ని మొదలు పెట్టి, దానితో వచ్చిన రిజల్ట్ ని బట్టి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచిస్తాము. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతోనే త్వరలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş