iDreamPost
android-app
ios-app

VK Naresh హోటల్ లో ప‌విత్ర‌ను చెప్పుతోకొట్ట‌బోయిన మూడో భార్య‌ ర‌మ్య, ముదిరిన న‌రేశ్ కుటుంబ వివాదం

  • Published Jul 03, 2022 | 2:04 PM Updated Updated Jul 03, 2022 | 2:04 PM
VK Naresh హోటల్ లో ప‌విత్ర‌ను చెప్పుతోకొట్ట‌బోయిన మూడో భార్య‌ ర‌మ్య,  ముదిరిన న‌రేశ్ కుటుంబ వివాదం

సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్((VK Naresh) కుటుంబ వ్య‌వ‌హారం ముదిరి వీధిన‌ప‌డింది. న‌రేశ్ తో తాను ఇంకా విడాకులు తీసుకోలేద‌ని వాదిస్తున్న మూడో భార్య ర‌మ్య, ప‌విత్ర లోకేష్ ను చెప్పుతో కొట్ట‌డానికి ప్ర‌య‌త్నించింది. సినియర్‌ నటుడు నరేశ్‌, పవిత్ర లోకేష్‌ జంట మైసూర్ హోటల్ లో ఉన్నార‌ని తెలుసుకున్న‌ నరేశ్‌ మూడో భార్య రమ్య(Ramya Raghupathi) గొడ‌వ‌కు దిగారు. త‌న‌కు విడాకులివ్వ‌కుండా వేరే అమ్మాయిని ఎలా పెళ్లిచేసుకొంటావంటూ న‌రేష్ ను ఆగ్ర‌హంతో అడిగింది. ఈ స‌మ‌యంలో పవిత్ర(Pavitra Lokesh)ను చెప్పుతో కొట్టేందుకు రమ్య ప్రయత్నించగా, చుట్టుపక్క‌ల ఉన్న‌వాళ్లు అడ్డుకున్నారు. ఈ లోగా, నరేశ్ విజిల్స్ వేసుకుంటూ, పవిత్రతో కలిసి లిఫ్ట్‌లో వెళ్లిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

ముందుగానే మీడియాకు లీక్ లిచ్చిన‌ ర‌మ్య ర‌ఘుప‌తి ‘‘అంతా తెలుసుకునే ఇక్కడి వచ్చాను. వాళ్ల‌ను డిస్ట్రబ్ చేయొద్దని ఇప్ప‌టిదాకా వెయిట్ చేశాను. రాత్రి గలాట చేసే రకం కాదు నేను. ఉదయం వరకు వెయిట్ చేశాను. నా బాధలు చెప్పుకున్నాను. రియాక్ష‌న్ ఏంటో మీరే చూస్తున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్‌ అంటూ రాత్రంతా ఒకే రూమ్‌లో ఉండటం ఏంటి ? మీ ఆడబిడ్డకు ఇలాగే జరిగితే చూస్తూ ఊరుకుంటారా? ఫ్రెండ్స్ అయితే ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా!

ఆమెకు భర్త ఉన్నాడుగా, ఆయ‌న‌ ముందే మాట్లాడుకోవచ్చుగా ? క్లోజ్డ్ డోర్ వెనుక వాళ్లకు ఏం పని? నన్ను చూడగానే గిల్ట్ ఫీల్ అయ్యాడు. అందుకే విజిల్స్ వేశాడు. అలా బిహేవ్ చేశారు. నా బంగారమే కరెక్ట్‌గా లేదు. నా జీవితం ఇలా అయిపోయింది. పవిత్రా లోకేష్ (Pavitra Lokesh) మీద నాకు ఎలాంటి ఆరోప‌ణ‌ల్లేవ్. నా కంప్లయింట్ల‌న్నీ నరేశ్ మీదే. నా ఫోన్ నంబర్ బ్లాక్‌లో పెట్టాడు. లీగల్‌గా ప్రొసీడ్ అవుతున్నా. ఫ్యామిలీ కోర్టుకెళ్తాన‌ని ర‌మ్య అన్నారు.

న‌రేశ్, అత‌ని మూడో భార్య ర‌మ్య ఇద్ద‌రూ చాలా ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈలోగా లోకేష్ ప‌విత్రతో న‌రేశ్ సన్నిహితంగా ఉంటున్నార‌న్న క‌థ‌నాలూ వ‌చ్చాయి. అటు న‌రేశ్, ఇటు లోకేష్ ప‌విత్ర‌లిద్ద‌రూ క్లారిటీ ఇచ్చారు. ఇద్ద‌రూ మ‌హాబ‌లేశ్వ‌రం వెళ్లి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన ఫోటోలు బైట‌కు రావ‌డంతో ర‌మ్య గొడ‌వ చేస్తున్నారు.

‘నరేశ్‌ నన్ను మోసం చేశాడు. మేం కలిసి లేము. విడాకులూ తీసుకోలేదు. మాకు పిల్లలు ఉన్నారు. మళ్లీ నరేశ్‌ ఎలా పెళ్లి చేసుకుంటాడు?’ అన్న‌ది ర‌మ్య సూటి ప్ర‌శ్న‌. కొన్నిరోజుల క్రితం దీనిపై పవిత్ర లోకేష్‌ కూడా స్పందించారు. రమ్య కావాలనే తనను బ్యాడ్‌ చేస్తున్నారని, ఏదైన ఉంటే హైదరాబాద్‌లో మాట్లాడకుండా, బెంగళూరు వచ్చి నన్ను చెడ్డగా చూపించడం కరెక్ట్‌ కాదని వీడియోలో అన్నారు.

ర‌మ్య వాద‌న‌పై న‌రేశ్ రియాక్ట్ అయ్యాడు. నేను ఇప్ప‌టికే విడాకుల నోటిసుల‌ను పంపించాను. డ‌బ్బు కోస‌మే ర‌మ్య‌, బ్లాక్ మెయిల్ చేస్తోంద‌ని న‌రేశ్ అంటున్నారు. మొత్తానికి కుటుంబ గొడ‌వ కాస్తా, ఇప్పుడు ర‌చ్చ‌కెక్కింది. బెంగుళూరు వ‌ర‌కు వెళ్లింది.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş