iDreamPost
android-app
ios-app

బాలకృష్ణ ఇంటి వద్ద యాక్సిడెంట్.. బాలయ్యబాబు ఇంటి ఫెన్సింగ్ ని కారుతో గుద్దేసిన యువతి..

  • Published May 18, 2022 | 6:00 PM Updated Updated May 18, 2022 | 6:00 PM
బాలకృష్ణ ఇంటి వద్ద యాక్సిడెంట్.. బాలయ్యబాబు ఇంటి ఫెన్సింగ్ ని కారుతో గుద్దేసిన యువతి..

హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద తాజాగా రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 45 వద్ద ఉన్న ఆయన ఇంటివైపుకి వేగంగా ఓ మహీంద్రా కార్ దూసుకొచ్చి బాలయ్య బాబు ఇంటి గేటుని ఢీకొట్టబోయి పక్కనే ఉన్న డివైడర్ ఎక్కి ఆయన ఇంటి గోడని, ఫెన్సింగ్, చెట్లని ఢీ కొట్టింది. ఆ సమయంలో కారుని ఓ యువతి డ్రైవ్ చేసింది.

బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది అనేసరికి ఒక్కసారిగా జనాలు గుమిగూడారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. పోలీసులకు విషయం తెలుసుకొని ట్రాఫిక్ క్లియర్‌ చేసి వాహనాలను, జనాలని పంపించేశారు. అనంతరం ఆ జీపు తోలిన యువతిని ప్రశ్నించగా.. అంబులెన్స్‌కు దారి ఇచ్చే క్రమంలో కారుని లెఫ్ట్ కి తీసుకోవడంతో అదుపు తప్పి ఇలా ఢీ కొట్టాను అని తెలిపింది. అయితే పోలీసులు ఆమె తాగిందేమో అని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది. ఈ యాక్సిడెంట్ లో ఎవరికి ఎలాంటి హాని జరగలేదు. ఆ కార్ ముందు భాగం మాత్రం డ్యామేజ్ అయింది.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Giriş