తెలుగుమీడియాలో రాధాకృష్ణ గురించి తెలిసిన వారంతా ఇటీవల కాలంలో ఆయన బాధను భరించలేకపోతున్నారు. పాపం..ఏపీలో అధికారం మారిన తర్వాత ఆయన ఆక్రోశం అంతా ఇంతా కాదు. ఆవేదన వర్ణనాతీతం. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో తానే సీఎం అన్నంతగా ఆయన ఊహించుకున్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రోత్సహించిన దశ నుంచి ప్రతిక పేరుతో పలు రకాల ప్రయోజనాల వరకూ అన్నింటా ఆయన పాత్ర సుస్పష్టం. చివరకు చంద్రబాబుని ఇంటర్వ్యూ చేస్తూ ఉద్యోగుల మీద వెళ్లగక్కిన ఉక్రోశం కూడా సాధారణ విషయమేమీ కాదు. అలాంటి రాధాకృష్ణ బాధ ఇప్పుడు ప్రపంచబాధగా మారినా లేకున్నా తాజాగా ఆయన చెంతకు చేరిన వెంకటకృష్ణను మాత్రం వ్యాపించినట్టు కనిపిస్తోంది. ఈ ఇద్దరి తీరుతో వారి వేదనకు అంతూపొంతూ లేదన్నట్టుగా సాగుతోంది.
ఈ ఇద్దరిదీ ఒకటే బాధ కావడంతో ఒకే గూటికి చేరారు. కలిసి బాధను పంచుకోవడం కోసమే అన్నట్టుగా దగ్గరయ్యారా అన్నట్టుగా ఉంది. వారం వారం రాధాకృష్ణ బాధను ఓ అరగంట పాటు టీవీలోనూ, ఓ హాఫ్ పేజీ పత్రికలోనూ జనం భరించక తప్పదన్నట్టుగా మారింది. ఇప్పటికే ఆ బాధను భరించలేని చాలామంది చందాదారులు సదరు పత్రికకు సెలవు చెప్పేశారు. దాని ప్రభావం సర్క్యులేషన్ లో కనిపిస్తోంది. చానెల్ రేటింగ్స్ లో దిగజారుతున్న తీరు నిదర్శనంగా నిలుస్తోంది. అయినా మార్పు లేదనే చెప్పవచ్చు. అందుకు అదనంగా వెంకటకృష్ణ చేరడంతో బాధాతప్త హృదయాల వేదనా భరిత వ్యాఖ్యానాల పరంపర సాగుతోంది.
Also Read: వ్యవసాయ బిల్లులలో ఏముంది..? మంత్రి రాజీనామాకు అసలు కారణాలేంటి..?
తాజాగా దమ్మాలపాటి కేసులో హైకోర్ట్ గ్యాగ్ ఉత్తర్వులను దేశంలోని అనేక మంది తప్పుబడుతున్నారు. మీడియా ప్రముఖులు, మేథావులు ఖండిస్తున్నారు. దానిని సహించలేని తత్వం వెంకటకృష్ణలో వెల్లడయ్యింది. అతడు పనిచేస్తున్న మీడియా సంస్థకి ఈ పరిణామాలు ఎంత కంటగింపుగా మారాయన్నది అతడి మాటల్లో స్పష్టమవుతోంది. సిద్ధార్థ వరద రాజన్ నుంచి ఉమా సుధీర్ వరకూ అందరినీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన తీరు గమనిస్తే వెంకటకృష్ణ పరిస్థితి బోధపడుతుంది. అందరూ తనలానే ఆలోచించాలని, తనకు గిట్టని వారిని అందరూ వ్యతిరేకించాలనే ఆలోచనకు చేరినట్టు కనిపిస్తోంది. హైకోర్ట్ ఉత్తర్వుల మూలంగా జరిగే నష్టాన్ని వెల్లడించడం సహించలేని తత్వం అతడి మాటల్లో కనిపిస్తోంది.
చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలకు బిన్నంగా సాగుతున్న పరిణామాలను తట్టుకోలేని తనం వెంకటకృష్ణలో తలపిస్తోంది. బాబు బ్యాచ్ కి జాతీయ స్థాయిలో పడిపోతున్న విలువని చూసి వేదన చెందుతున్నట్టు కనిపిస్తోంది. తన ఆవేదనాభరిత అక్రోశాన్ని చాటుకునేందుకు దేశంలోనే ప్రముఖ జర్నలిస్టులందరి మీద వెళ్ళడక్కే ప్రయత్నం చేసినట్టుగా చాటిచెబుతోంది. తాను న్యూట్రల్ జర్నలిస్టునని చెప్పుకుని నిండా ఆరు నెలలు గడిచేలోగా వెంకట కృష్ణ ఇంత వెనకటితనం చాటుకుంటున్న తీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. వార్తలకు బదులుగా రాజకీయ వ్యాపారాలకు దిగుతున్న వారి వ్యవహారం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఓ ఉదాహరణగా మారుతోంది. అయినా ఇంతటి ఆవేదనను ఆయన టీవీల నిండా వెళ్లగక్కుతున్నా జనం మాత్రం అందుకు భిన్నంగా స్పందిస్తుండడంతో రాధా..వెంకట కృష్ణలు ఇంకా ఎంతటి మనోవేదనను భరించాలో అన్నది అంతుబట్టని విషయంగా మారింది.