సినిమాల్లో యాక్టింగ్ కోసం చాలామంది ట్రైచేస్తూ ఉంటారు కానీ ఆ ఛాన్స్ ఎప్పుడు, ఎవరికి ఎలా వస్తుందో చెప్పలేము. అసలు ఇండస్ట్రీకి సంబంధంలేని వాళ్ళు కూడా యాక్టర్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఓ IAS ఆఫీసర్ కూడా యాక్టర్ గా మారి ఇప్పుడు చాలా పాపులర్ పర్సన్ గా ఎదిగాడు. అభిషేక్ సింగ్.. చిన్నప్పుడు తండ్రి ఉత్తరప్రదేశ్ స్టేట్ పోలీస్ సర్వీస్‌లో పనిచేయడం చూసి చిన్నప్పటి నుంచీ ఐఏఎస్ సాధించాలని కలలు కని సాధించాడు. ఢిల్లీలో IAS ఆఫీసర్ గా భాద్యతలు చేపట్టాడు.
ఒకసారి అధికారిక పనిమీద ముంబైకి వెళ్లగా ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్, తన ఫ్రెండ్ అయిన ముకేశ్ ని కలవడానికి వెళ్ళాడు. అదే సమయంలో ముకేశ్ దగ్గరికి నెట్ ఫ్లిక్స్ టీం ‘ఢిల్లీ క్రైమ్-2’ సిరీస్ వర్క్ కోసం వచ్చి వాళ్ళు అభిషేక్ ని చూశారు. అతని బాడీ కటౌట్, అందం చూసి నటుడు అనుకోని ‘ఢిల్లీ క్రైమ్-2’లో నటించమని అడగగా అతను యాక్టర్ కాదు IAS అని అసలు సంగతి చెప్పాక ఆశ్చర్యపోయారు. అయినా వదలకుండా ‘ఢిల్లీ క్రైమ్-2’లో IAS ఆఫీసర్ పాత్ర ఉంది వేయమని ఒప్పించారు. అలా యాక్టింగ్ లోకి ఎంటర్ అయిన అభిషేక్ సింగ్ కి ఆ సిరీస్ తర్వాత వరుసగా ఛాన్సులు వచ్చాయి. ఒక పక్క సిరీస్, సినిమాల్లో నటిస్తూ కొన్ని రోజులు ఉద్యోగాన్ని మేనేజ్ చేసినా తర్వాత కుదరకపోవడంతో ఉద్యోగాన్ని వదిలేసి పూర్తిగా యాక్టింగ్ వైపు వచ్చాడు. ఒక మ్యూజిక్ ఆల్బమ్‌లోనూ చేయగా అది యూట్యూబ్‌లో భారీ వ్యూస్ సాధించింది.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ‘ఫ్యాషన్ వీక్- 2022’లో ర్యాంప్ వాక్ చేసి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు అభిషేక్. నటుడిగా మారిన ఈ IAS ఆఫీసర్ కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు కూడా చేశాడు. అంతేకాక ఇప్పటికి పలు సంస్థలకు IAS ఆఫీసర్ హోదాలో సలహాదారుడిగా కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఇతనికి. అభిషేక్ భార్య దుర్గాశక్తి నాగపాల్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ కావడం విశేషం.