iDreamPost
android-app
ios-app

2032 ఒలంపిక్స్ ఎక్కడో తెలుసా ..!

2032 ఒలంపిక్స్ ఎక్కడో తెలుసా ..!

ఒలంపిక్స్ క్రీడల కంటే, వాటిని నిర్వహించుకునేందుకు దేశాల మధ్య పోటీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రస్తుతం జపాన్ లో జరుగుతున్న ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం అవుతున్న సమయంలోనే 2032 సంవత్సరానికి సంబంధించిన క్రీడలను నిర్వహించుకునేందుకు ఆస్ట్రేలియా హక్కులను దక్కించుకుంది. ప్రతి ఐదేళ్లకు జరిగే ఈ విశ్వ క్రీడల నిర్వహణ అనేది పెద్ద దేశాలకు ప్రతిష్ట తో కూడిన వ్యవహారం.

ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ 2032 క్రీడల నిర్వహణకు సంబంధించిన బిడ్స్ తీసింది. దీనిలో ఆస్ట్రేలియా ఒకే ఒక బిడ్ మాత్రమే వేయడంతో 2032 ఒలింపిక్స్ క్రీడల్లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరం వేదిక గా జరగనున్నాయి. దీంతో ఆస్ట్రేలియా ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం మూడోసారి అవుతుంది. గతంలో మెల్బోర్న్, సిడ్నీ వేదికలుగా క్రీడలను నిర్వహించిన ఆస్ట్రేలియా ఈసారి బ్రిస్బేన్ నగరాన్ని ఎంచుకుని బిడ్డింగ్లో పాల్గొంది. ప్రస్తుతం జపాన్ లోని టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్ క్రీడలు నాలుగేళ్ళ తర్వాత (2024) ప్యారిస్ లో, 2028లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరగనున్నాయి. వచ్చే రెండు ఒలింపిక్స్ ఎక్కడ నిర్వహించాలన్నది ప్రకటించిన ఒలంపిక్స్ కమిటీ 2032 ఒలింపిక్స్ నిర్వహణకు ఆస్ట్రేలియాను ఎంపిక చేసింది.

Also Read : ఆ సీనియర్ నేత బీజేపీలోనూ ఇమడలేకపోయారా..?

ఒలింపిక్స్ నిర్వహణ అన్నది సాధారణ విషయం కాదు. ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చే క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వడం తో పాటు, క్రీడలను చూసేందుకు విశ్వవ్యాప్తంగా వచ్చే పర్యాటకులకు సరైన ఆతిథ్యం ఇవ్వడం వారిని జాగ్రత్తగా చూసుకోవడం పెద్ద పని. అలాగే ఒలంపిక్స్ లో 339 విభాగాల్లో జరిగే క్రీడలకు సరైన వేదికలు నిర్మించడం, అలాగే అద్భుతమైన గ్యాలరీలు, మైదానాలు అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం, దానికి సంబంధించిన నిధులను వ్యయం చేయడం అనేది తలకు మించిన భారం అవుతుంది. దీని కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒలింపిక్స్ జరిగే రోజుల తర్వాత ఆ మైదానాల నిర్వహణ కోసం భారీ ఎత్తున సిబ్బందిని నియమించడంతో పాటు ఒలింపిక్స్ అనంతరం మైదానాల నిర్వహణ అనేది చాలా కష్టం. అయితే ఒలింపిక్స్ నిర్వహించడం అనేది పెద్ద దేశాలకు ప్రతి తో కూడుకున్న అంశం కావడంతో దీని కోసం ఎప్పుడూ పోటీ ఉంటుంది. ఒకసారి ఒక నగరంలో ఒలింపిక్స్ నిర్వహిస్తే మళ్ళీ ఆ నగరంలో ఒలంపిక్స్ ఉండవు. దీంతో పెద్ద దేశాలు రకరకాల నగరాలను బిడ్డింగ్లో వేసి ఆ దేశానికి ఒలంపిక్స్ గేమ్స్ వచ్చేలా చూస్తాయి.

భారత్ ఒలింపిక్స్ గేమ్స్ బిడ్డింగ్లో ఎప్పుడూ పాల్గొనలేదు. అవసరం మేరకు వనరులు లేకపోవడంతో పాటు సౌకర్యాల లేమి నిధుల లభ్యత అంతంత మాత్రంగా ఉండడంతో ఇండియా ఈ బిడ్డింగ్ లో ఇంతవరకు పాల్గొన లేదు. పెద్ద పెద్ద క్రీడ ఈవెంట్లను నిర్వహించడంలో ప్రతిసారి తడబాటుకు గురయ్యే భారతదేశం 2009లో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ సందర్భంగా తన పరువు పోగొట్టుకొంది. కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా అప్పట్లో తీసుకున్న ప్రభుత్వం దానిలో భారీ ఎత్తున అవినీతి పాల్పడిందని తేలడం ప్రపంచ దేశాల దగ్గర తలవంపులు తెచ్చింది. దీంతోపాటు ఒలింపిక్స్ నిర్వహణ కమిటీ భారతదేశంలోని పరిస్థితులు సౌకర్యాలు నిధుల లభ్యత పర్యాటకులు రావడానికి అనువైన పరిస్థితులను అంచనా వేసి కానీ బిడ్డింగ్ లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వదు. ఈ విషయంలో ఇంకా భారత దేశం వెనుకబడి ఉందని చెప్పాలి. ఒలింపిక్స్ నిర్వహణను కాదు కనీసం ఒలంపిక్స్కు క్రీడాకారులు పంపడానికి కూడా మనదేశంలో అనువైన మైదానాలు లేవంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Also Read : కృష్ణా జలవివాదం -ఆంధ్రాకు సానుకూల నిర్ణయం దిశగా కేంద్రం ప్రకటన