పీఆర్సీ, ఫిట్‌మెంట్‌పై కార్యదర్శుల కమిటీ రూపొందించిన నివేదిక ఏపీ సీఎం జగన్‌కు అందచేసింది సీఎస్ సమీర్ శర్మ, కమిటీ సభ్యుల బృందం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసిన ఈ బృందం నివేదికను అందచేసింది. రెండు మూడు రోజుల్లో వైఎస్ జగన్ దాన్ని పరిశీలించి ప్రకటన చేయనున్నారు.
పీఆర్‌సీ, ఫిట్‌మెంట్‌కు సంబంధించిన కీలక వివరాలు
ఫిట్‌మెంట్‌పై సీఎం జగన్‌కు 11 ప్రతిపాదనలు
ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్‌మెంట్‌ల పరిశీలనతో ప్రతిపాదనలు.
పీఆర్‌సీ, ఫిట్‌మెంట్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత 7 రకాల సిఫార్సులు
నివేదికలోని 11 అంశాల అమలు ..
5 అంశాల మార్పులతో అమలు ..
2 అంశాల అమలు చేయక్కర్లేదు అంటూ ప్రతిపాదనలు.
11 పీఆర్‌సీ ప్రతిపాదనలతో పాటు 23శాతం ఫిట్‌మెంట్.
11 పీఆర్‌సీ ప్రతిపాదనలతో పాటు 27 శాతం ఫిట్‌మెంట్.
11 పీఆర్‌సీ ప్రతిపాదనలతో పాటు 14 శాతం ఫిట్‌మెంట్.
11 పీఆర్‌సీ ప్రతిపాదనలతో పాటు 30 శాతం ఫిట్‌మెంట్.
మొత్తం 7 రకాల ప్రతిపాదనలు సీఎం దృష్టికి
ఈ ఏడింటిలో ఏదో ఒక ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం
అలా ఎంచుకుంటే దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల వరకు అదనపు భారం.
ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది, సచివాలయ ఉద్యోగులకూ ఫిట్‌మెంట్ సిఫార్సు.
పెండింగ్ డీఏలపై ఆర్థిక శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం.
Also Read : ఫిట్‌మెంట్ ఎంతో చెప్పిన సీఎస్ శర్మ
ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు..
జులై 1, 2019 నుంచి 27 శాతం ఐఆర్.
ఐఆర్ రూపంలో ఉద్యోగులకు రూ.11,270.21 కోట్లు, పెన్షనర్లకు రూ.4,569.78 కోట్లను చెల్లించిన ప్రభుత్వం.
అంగన్‌వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులతో కలిపి మొత్తంగా 3,01,021 మంది ఉద్యోగులకు జీతాల పెంపు.
కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సైతం నివేదికలో ప్రస్తావించిన సీఎస్ కమిటీ
2018-19లో ఉద్యోగుల జీతాలు, పింఛన్లు రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు.
2020-21 నాటికి వ్యయం రూ.67, 340 కోట్లు.
2018-19 రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో ఉద్యోగుల జీతాలు, పింఛన్లు మొత్తం 84 శాతం.
2020 – 21 నాటికి 111 శాతానికి చేరిన ఉద్యోగుల జీతాలు, పింఛన్ల మొత్తం.
ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పింఛన్ల కోసం 2018-19లో 32 శాతం, 2020-21 నాటికి 36 శాతానికి చేరిక.
2020-21లో తెలంగాణలో ఇది కేవలం 21 శాతం మాత్రమే.
ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిన రాష్ట్ర విభజన
తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 అయితే ఏపీలో కేవలం రూ.1,70, 215 మాత్రమే.
ఇంకా తెలంగాణ నుంచి రావాల్సి ఉన్న రూ.6,284 కోట్ల విద్యుత్ బకాయిలు.
రెవెన్యూ లోటు కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.18,969 కోట్లు.
కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మీద రూ.20వేల కోట్ల అదనపు భారం.
ఏపీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, కారణంగా 2020 జనవరి నుంచి అక్టోబర్ 2021 వరకు ప్రభుత్వంపై రూ.5380 కోట్ల అదనపు భారం.
Also Read : సీఎం చేతిలో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగుల్లో ఉత్కంఠ..