iDreamPost
android-app
ios-app

ఒక్కరోజులో 11,458 పాజిటివ్ కేసులు-386 మరణాలు

ఒక్కరోజులో 11,458 పాజిటివ్ కేసులు-386 మరణాలు

కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 10 వేలకు పైగా కేసులు, 300 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. కానీ నిన్న తొలిసారిగా 11 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 11,458 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 386 మరణాలు సంభవించాయి. ఇప్ప.దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 3,08,993 కి చేరింది.  అంతేకాకుండా మరణాల సంఖ్య 8,884 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల్లో నిన్న నమోదయిన కేసులే అత్యధికం. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగవ స్థానంలో కొనసాగుతోంది.  కరోనా వైరస్ బారినుండి 1,54,329 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1,45,779 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 3493 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 1,01,141 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 3717 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 55,451 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 2044 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 164 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 4484 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2278 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 2032 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 174 మంది మృత్యువాత పడ్డారు.నిన్న ఒక్కరోజే 9 మరణాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 207 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 5636 మందికి కరోనా సోకగా 80 మంది మృత్యువాత పడ్డారు. 3091 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2465 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 7,739,944 మందికి కోవిడ్ 19 సోకగా 428,337 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 3,966,293 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 2,116,922 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 116,825 మంది మరణించారు.

Jojobet GirişbetparkGrandpashabetgrandpashabetCasibomMeritkingGrandpashabetCasibomcasibomjojobet girişjojobetinterbahisjojobetMadridbetMadridbetJojobet girişgrandpashabetJojobetcasibomgrandpashabetjojobetcasibomjojobetjojobetcasibomcasibom girişgrandpashabetholiganbetgrandpashabet güncel girişjojobetjojobet girişgrandpashabet