iDreamPost

AP: సామాన్యులకు న్యూ ఇయర్ షాక్! 2024లో భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

  • Published Dec 27, 2023 | 6:23 PMUpdated Dec 27, 2023 | 6:23 PM

తెలుగు రాష్ట్రాల్లో మిగ్‌జాం తుఫాన్ కారణంగా వరి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఈ తుఫాను కారణంగా అన్నదాతల కష్టాలు పెద్దగా వెలుగులోకి రాలేదు కానీ, ధరల పై మాత్రం ఆ ప్రభావం గణనీయంగా చూపనుంది. అది విధంగానో ఇప్పుడు చూద్దాం..

తెలుగు రాష్ట్రాల్లో మిగ్‌జాం తుఫాన్ కారణంగా వరి పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. అయితే ఈ తుఫాను కారణంగా అన్నదాతల కష్టాలు పెద్దగా వెలుగులోకి రాలేదు కానీ, ధరల పై మాత్రం ఆ ప్రభావం గణనీయంగా చూపనుంది. అది విధంగానో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 27, 2023 | 6:23 PMUpdated Dec 27, 2023 | 6:23 PM
AP: సామాన్యులకు న్యూ ఇయర్ షాక్! 2024లో భారీగా  పెరగనున్న బియ్యం ధరలు!

ఇటీవలే కాలంలో మిగ్‌జాం తుఫాన్ తెలుగు రాష్ట్రాల్లో విధ్వసం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ తుఫాను గతనెల నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్‌ మొదటి వారం వరకు అటు ఏపీతో పాటు తెలంగాణలో కూడా వర్షాలు కురిశాయి. అయితే కోస్తా ఆంధ్ర జిల్లాలో మాత్రం ఈ తుఫాను ఎక్కువగా ముంచెత్తింది. కాగా, రాష్ట్రాల్లోని పలుచోట్ల వరి పంట సాగుపై తీవ్ర ప్రభావం చూపించింది. వరుసగా మూడేళ్లుగా పంట దిగుబడి తక్కువగా ఉండటంతో పాటు, ఈ ఏడాది మిగ్‌జాం తుఫాను దెబ్బకు పంటలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. ఇక కొన్ని చోట్ల పంట పూర్తిగా నీటిలో నాని పోయింది. అలా రోజుల తరబడి పంట నీటిలో నాని పోవడంతో ఎందుకు పనికి రాకుండా పోయింది. సరిగ్గా పంటలు చేతికి వచ్చే సమయానికి భారీ వర్షాలు కురవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే ఈ మిగ్‌జాం తుఫాన్ కారణంగా.. అన్నదాతల కష్టాలు పెద్దగా వెలుగులోకి రాకపోయినా, ధరల పై మాత్రం ఆ ప్రభావం గణనీయంగా చూపనుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

మిగ్‌జాం తుఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ పంట భారీగా నష్టం వచ్చిందని మిల్లర్లు చెబుతున్నారు. ఇక పంట దిగుబడి కూడా తక్కువగా ఉండటంతో.. ఒక్కసారిగా బియ్యం ధరలు పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు. అయితే గత నెలలో 26 కిలోల బియ్యం బస్తా రూ.1400 ఉండగా. ప్రస్తుతం ధర రూ. 1500 నుంచి 1600కు చేరింది. ఇక ప్రతి వారం ధరలు పెరుగుతాయని, వచ్చే ఏడాది జనవరి నెలాఖరుకు 26కిలోల బియ్యం బస్తా ధర రూ.2వేలకు చేరవచ్చని హోల్ సేల్ వ్యాపారస్తులు అంచనా వేస్తున్నారు. అలాగే, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే రబీ పంటపైనే ధరలు ఆధారపడి ఉంటాయని చెబుతున్నారు. కాగా, రబీలో కూడా పంట సరిగా రాకపోతే ఈ ఏడాది జనానికి గడ్డు పరిస్థితులు తప్పవు అని అన్నారు. ప్రస్తుతం మిల్లులో ఉన్న ధాన్యం దాదాపు ఐదారు నెలల వినియోగానికి వస్తుంది. ఆ తర్వాత ధరలు పెంచాల్సి ఉంటుందని విజయవాడకు చెందిన ఓ మిల్లరు చెప్పాడు. కాగా, ధాన్యం కొనుగోలు చేయడానికి అవకాశాలు లేకపోవడంతో.. ధరలు సహజంగానే పెరుగుతున్నాయని తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సన్న బియ్యం బ్రాండెండ్ రకం కిలో రూ.60 నుంచి 62వరకు ధర పలుకుతున్నాయి. మరో వారం పదిరోజుల తర్వాత ఈ ధరలు రూ.70కు చేరుతాయని చెబుతున్నారు. ఆ తర్వాత మరో ఐదు రుపాయలకు అటు ఇటుగా పెరిగి బస్తా కాస్తా, రూ.2వేల రుపాయల వద్ద స్థిరపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా ఒక్కసారిగా బియ్యం ధరలు పెరగడం పై సామాన్య ప్రజల ఆందోళనకు గురవుతున్నారు. ఈ మిగ్‌జాం తుఫాను మొదటగా తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో విధ్వంసం సృష్టించింది. ఆ తర్వాత తీరం దాటగా గోదావరి జిల్లాలు నష్టపోయాయి. ఇలా రాష్ట్రంలో తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా లక్షల ఎకరాల వరి పంటను అన్నదాతలు నష్టపోయారు. అధికారిక లెక్కల్లో అయితే లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు తేలింది. మరి, భారీగా పెరగనున్న బియ్యం ధరల పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి