iDreamPost

నయని- యావర్.. హౌస్ లో కొత్త జంట! వీళ్లది మరీ చింతపండు పులిహోర..!

నయని- యావర్.. హౌస్ లో కొత్త జంట! వీళ్లది మరీ చింతపండు పులిహోర..!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 2.0 ఆట పరంగా అంతా బాగానే ఉంది. కానీ, ప్రేక్షకుల్లో మాత్రం ఒక చిన్న అసంతృప్తి ఉండిపోయింది. అదేంటంటే.. బిగ్ బాస్ అంటే కచ్చితంగా ఒకటి లేదా రెండు అయినా ప్రేమ జంటలు హౌస్ లో ఉంటాయి. కానీ, ఈ సీజన్ లో మాత్రం అసలు అలాంటి కథే లేదు. మొదట్లో ఒక ట్రాక్ సెట్ అయింది అనుకునే సమయానికి అక్కా తమ్ముళ్లు అయిపోయారు. తర్వాత ఇంకో ట్రయాంగిల్ లవ్ రాబోతోంది అనుకుంటే అది కూడా తుస్ మంది. ఇలా ట్రాకులు లేవని డీలా పడిపోయిన ప్రేక్షకుల్లో యావర్ కొత్త ఆశ చిగురింపజేస్తున్నాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయనీ పావనీతో పులిహోరలో కొత్త రెసిపీ ట్రై చేస్తున్నాడు.

యావర్ ఆటలో ఎంత క్లియర్ గా ఉన్నాడో.. ట్రాకుల విషయంలో కూడా అంతే క్లారిటీతో ఉన్నాడు. కంటెంట్ రావాలి అంటే కచ్చితంగా ట్రాక్ ఉండాలి అని యావర్ బలంగా నమ్ముతున్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే.. అప్పట్లో రతికా రోజ్ తో యావర్ పులిహోర కలిపిన విషయం అందిరికీ తెలిసిందే. వ్యతిరేకంగా ఓటు వేసినా కూడా యావర్ ఎంతో ప్రేమతో గోరు ముద్దలు తినిపించాడు. సరే రతికా రోజ్ తో అయినా సెట్ అవుతాడు అనుకుంటే.. ఆమె కాస్తా ఎలిమినేట్ అయిపోయింది. ఆ తర్వాత శుభశ్రీతో యావర్ క్లోజ్ గా ఉన్నాడు. నిజానికి వాళ్లు సీజన్ స్టార్టింగ్ నుంచే ఒక ఒప్పందం ప్రకారం ఆడుతూ వచ్చారు. ముందు ఫ్రెండ్స్ అని ఆ తర్వాత ఫ్రెండ్స్ కంటే మించి అంటూ పులిహోర కలుపుకున్నారు.

తీరా ఆమె కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఆ సమయంలో యావర్ ఎంతో ఎమోషనల్ కూడా అయ్యాడు. సరేలే రెండు ట్రాకులు సెట్ కాలేదు ఇంక గేమ్ మీద ఫోకస్ పెడతాడులే అనుకుంటే.. ఇప్పుడు వైల్డ్ కార్డు రూపంలో యావర్ కి ఇంకో అవకాశం లభించింది. కొత్తగా వచ్చిన నయనీ పావనీతో కొత్త పులిహోర రెసిపీ స్టార్ట్ చేశాడు. ఈసారి ఏకంగా చింతపండు పులిహోర షురూ చేశాడు. నయనీ పావనీ రెడీ అవతుంటే.. ఇంత అందంగా రెడీ అవుతున్నావ్ నాకోసమేనా అంటూ అడిగేశాడు. ముందు రోజు నుంచే అమ్మాయి అంటే నాకు ఇష్టం అంటూ శివాజీ దగ్గర కూడా తెగ సిగ్గు పడ్డాడు. ఇప్పుడు తాజాగా వీళ్ల మధ్య బెడ్ రూమ్ లో ఒక 3 గంటలపాటు ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఇద్దరూ సిగ్నల్స్ ఇచ్చుకున్నారు.

నీ అందం నా కోసమేనా అని యావర్ అడగడం, నేను సింగిల్ యావర్ అని నయనీ చెప్పడం ఈ మొత్తం చూస్తుంటే కొత్తగా ట్రాక్ వచ్చేలాగే ఉంది. నయనీ ఆమ్ లెట్ వేసుకోవాలి అంటే యావర్ నేను వేసివ్వనా అంటూ ఎంతో ప్రేమగా అడిగాడు. తినడానికి వెళ్తుంటే.. ఇంకాసేపు ఉండచ్చు కదా అంటూ అడిగేశాడు. అంత ప్రేమగా అడిగితే నయనీ మాత్రం ఎలా కాదంటుంది చెప్పండి. అందుకని ఫుడ్ తీసుకుని యావర్ ఉన్న బెడ్ దగ్గరికే వచ్చేసింది. అయితే నయనీ ఆనియన్స్ తినను అంటూ తీసి పక్కన పెట్టేస్తోంది. నేను తింటాను అంటూ ప్రిన్స్ యావర్ ఆ ఎంగిలి ఉల్లిపాయలను మహా ప్రసాదం అన్నట్లు తినేశాడు. ఆ విధంగా హౌస్ లో కాసేపు హౌస్ లో పులిహోర మిక్సింగ్ జరిగింది. మరి.. ఈ కొత్త జంటపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి