P Krishna
ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే. ఒకప్పుడు కొత్త సినిమాలు థియేటర్లో చూడని వారు బాధపడేవారు.. కానీ ట్రెండ్ మారింది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది.
ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంది. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే. ఒకప్పుడు కొత్త సినిమాలు థియేటర్లో చూడని వారు బాధపడేవారు.. కానీ ట్రెండ్ మారింది. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుంది.
P Krishna
ఒకప్పుడు కొత్త సినిమా చూడాలంటే ముందుగానే బుకింగ్ చేసుకోవడం, క్యూ లైన్లో నిలబడి నానా తంటాలు పడి టికెట్ తీసుకొని తమ అభిమాన నటుల సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.. టెక్నాలజీ పుణ్యమా అని సినీ ప్రేమికులు కొత్త సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో హెచ్డీ క్వాలిటీతో ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూసే అవకాశం లభిస్తుంది. కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా ఓటీటీ వేదికలకు మహర్ధశ పట్టింది. అన్ని రకాల భాషా చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. సినిమాలు, వెబ్ సీరీస్ ఇంటి వద్ద కూర్చొని చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇందుకు తగ్గట్టుగానే లెటెస్ట్ సినిమాలు, వెబ్ సీరీస్ ఒకే వారంలో పదుల సంఖ్యల్లో రిలీజ్ అవుతున్నాయి. వరల్డ్ వైడ్ టాప్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో నెట్ ఫ్లిక్స్ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. తాజాగా నెట్ ఫ్లిక్స్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఓటీటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. లెటెస్ట్ మూవీస్, సరికొత్త వెబ్ సీరీస్ ఓటీటీల అలరిస్తున్నాయి.. దీంతో థియేటర్లో కన్నా ఇంట్లో కూర్చొని చూసేందుకు ఇష్టపడుతున్నారు. భారత్ లో నెట్ఫ్లిక్స్ కి చాలా మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. దీంతో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లోకల్ మార్కెట్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తూ అన్ని భాషల్లో కంటెంట్ తీస్తుంది. లేటెస్ట్ సినిమాలు, వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవల నెట్ఫ్లిక్స్ సీఈఓ సినీ పరిశ్రమకు చెందిన స్టార్స్ ని ప్రత్యేకంగా కలిసి వారితో పలు విషయాలు చర్చించి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా నెట్ఫ్లిక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఈ మధ్య కాలంలో కొంతమంది బోల్డ్, ఏ సర్టిఫిక్ ఉన్న కంటెంట్ చూడటానికి ఇష్టపడుతున్నారు.. ప్రత్యేకంగా అలాంటి కంటెంట్ కోసమే నెట్ఫ్లిక్స్ తీసుకుంటున్నారు. ఇండియన్ సెన్సార్ బోర్డ్ మూవీస్ ని సెన్సార్ చేసిన తర్వాత రిలీజ్ కి పరిమిషన్ ఇస్తుంది. కానీ సెన్సార్ చేయని వర్షన్ సినిమాలని ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. వీటిని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. దీంతో చిత్ర యూనిట్ కూడా వైలెన్స్, బోల్డ్ సీన్లు, డైలాగ్ లాంటి సినిమాలపై ఫోకస్ చేస్తుంది. తాజాగా దీనిపై కొంతమంది సెన్సార్ ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నెట్ఫ్లిక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అసభ్యకరమైన కంటెంట్ ఉండే సీరీస్, మూవీస్ ని స్ట్రీమింగ్ కానివ్వమని, థియేట్రికల్ రిలీజ్ మూవీస్ వరకు ఇండియన్ సెన్సార్ రూల్స్ ప్రకారం సెన్సార్ చేసిన చిత్రాలను మాత్రమే స్ట్రీమింగ్ చేస్తామని తెలిపింది. దీంతో ఏ రేటెడ్ ఫుల్ వర్షన్ మూవీస్ కోసం నెట్ఫ్లిక్ తీసుకున్న సబ్ స్క్రైబర్స్ కి షాక్ తగిలినట్లయ్యింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.