Somesekhar
నేపాల్ కు చెందిన దీపేంద్ర సింగ్ అయిరీ పేరు చెబితే.. వరల్డ్ రికార్డులే వణుకుతున్నాయి. తాజాగా ఖతార్ జరిగిన టీ20 మ్యాచ్ లో మరో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఆ వివరాల్లోకి వెళితే..
నేపాల్ కు చెందిన దీపేంద్ర సింగ్ అయిరీ పేరు చెబితే.. వరల్డ్ రికార్డులే వణుకుతున్నాయి. తాజాగా ఖతార్ జరిగిన టీ20 మ్యాచ్ లో మరో వరల్డ్ రికార్డు నెలకొల్పాడు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎంతో మంది విధ్వంసకర ప్లేయర్లను చూసుంటారు. వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఏబీడీ, పొలార్డ్, రస్సెస్ లాంటి ఎందరో ఆటగాడు ఉన్నారు. కానీ ప్రస్తుతం ఓ పేరు వరల్డ్ క్రికెట్ లో సంచలనంగా మారింది. అనామక క్రికెట్ జట్టు అయిన నేపాల్ కు చెందిన దీపేంద్ర సింగ్ అయిరీ పేరు చెబితే.. వరల్డ్ రికార్డులే వణుకుతున్నాయి. దీపేంద్ర సింగ్ తాజాగా జరిగిన టీ20 మ్యాచ్ లో ఒకే ఓవర్లో 6 సిక్సులు బాది సరికొత్త చరిత్ర సృష్టించాడు.
దీపేంద్ర సింగ్ అయిరీ.. అనామక నేపాల్ క్రికెట్ జట్టులో ఓ ప్లేయర్. కానీ ఇతడి పేరు చెబితే.. వరల్డ్ రికార్డులే వణుకుతాయ్ అంటే అతిశయోక్తికాదు. ఎందుకంటే? అంతలా ప్రపంచ క్రికెట్ రికార్డులను బద్దలు కొడుతూ ముందుకుసాగుతున్నాడు. తాజాగా ఖతార్ తో జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్ లో ఒకే ఓవర్లో 6 సిక్సర్లు బాది రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో ఖతార్ పేసర్ కమ్రాన్ ఖాన్ బౌలింగ్ లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది.. ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్ గా చరిత్రకెక్కాడు. ఇంతకుముందు టీమిండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్, వెస్టిండీస్ మాజీ ప్లేయర్ కీరన్ పొలార్డ్ లు ఇలా 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టారు.
అయితే దీపేంద్రసింగ్ కు రికార్డులు బ్రేక్ చేయడం కొత్తేమీ కాదు. గతేడాది మంగోలియాతో జరిగిన మ్యాచ్ లో కేవలం 9 బంతుల్లోనే ఫిఫ్టీ కొట్టి చరిత్ర సృష్టించాడు. ఇక ఇప్పుడు మరోసారి తన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజెప్పాడు. దీంతో అయిరీ పేరు చెబితే.. వరల్డ్ రికార్డులే వణుకుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీపేంద్ర సింగ్ కేవలం 21 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సులతో 64 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. అనంతరం 211 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఖతార్ టీమ్ 9 వికెట్లకు 178 పరుగులు చేసింది. దీంతో 32 పరుగులతో విజయం సాధించి నేపాల్ టీమ్. ఏసీసీ టీ20 ప్రీమియర్ కప్ లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. మరి ప్రపంచ రికార్డులను అలవోకగా బద్దలు కొడుతున్న దీపేంద్రసింగ్ అయిరీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
DIPENDRA SINGH AIREE BECOMES THE THIRD PLAYER TO HIT 6 SIXES IN AN OVER IN T20I HISTORY ⭐🔥 pic.twitter.com/UtxyydP7B0
— Johns. (@CricCrazyJohns) April 13, 2024