iDreamPost

లోక్ సభ ఎన్నికల్లో తండ్రి ఓటమి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన స్టార్ హీరోయిన్!

తాజాగా వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో తన తండ్రి ఓటమి చెందడంతో.. ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

తాజాగా వెలువడిన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో తన తండ్రి ఓటమి చెందడంతో.. ఎమోషనల్ పోస్ట్ ను షేర్ చేసింది స్టార్ హీరోయిన్. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

లోక్ సభ ఎన్నికల్లో తండ్రి ఓటమి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన స్టార్ హీరోయిన్!

దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి ముగిసింది. లోక్ సభ ఎన్నికల ఫలితాల కోసం దేశం మెుత్తం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసింది. ఇక ఈ ఎన్నికల్లో సినీ ప్రముఖులు చాలా మందే బరిలోకి దిగి తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. అందులో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్, రవి కిషన్ విజయం కేతనం ఎగురవేశారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ హీరోయిన్ నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ కూడా పోటీ చేశాడు. కానీ తన ప్రత్యర్థిపై ఓడిపోయాడు. తండ్రి ఓటమిపై నేహా శర్మ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

లోక్ సభ ఎన్నికల్లో పలువురు సినీ సెలబ్రిటీలు పోటీ చేసి.. తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. అందులో కొందరు విజయం సాధించగా.. మరికొందరు ఓటమి చెందారు. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగానా చెప్పినట్లుగానే విజయం సాధించి.. తన సత్తా ఏంటో నిరూపించుకుంది. రేసుగుర్రం విలన్ రవి కిషన్ సైతం మరోసారి విజయం సాధించాడు. ఇక ఈ ఎన్నికల్లో చిరుత మూవీ హీరోయిన్ నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ కూడా ఎంపీగా పోటీ చేశాడు. బీహార్ లోని భాగల్ పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేశారు. కానీ తన సమీప ప్రత్యర్థి జేడీయూ పార్టీ తరఫున పోటీ చేసిన అజయ్ మండల్ చేతిలో ఓడిపోయాడు.

అయితే.. తన తండ్రి ఓటమిపై ఎమోషనల్ అయ్యింది కూతురు నేహా శర్మ. “ఇది మాకు కఠినమైన రోజు. మేము విజయం కోసం అన్ని విధాలా పోరాడాం. మా నాన్నను నమ్మి ఓటేసిన అందరికి ధన్యవాదాలు. భవిష్యత్ ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఓటమితో కుంగిపోకుండా ముందుకు సాగాలని అందరూ గుర్తుంచుకోవాలి. పర్వతంలా దృఢంగా నిలబడాలి, సింహంలా గర్జించాలి, ధైర్యంగా ముందుకుసాగాలి” అంటూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. భాగల్ పూర్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసిన తన తండ్రి తరఫున ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేసింది నేహా శర్మ. కానీ తండ్రిని మాత్రం గెలిపించలేకపోయింది.

Neha sharma emotional post for his father loosing in lok sabha election

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి