iDreamPost

అసోంలో ఎన్డీయే ఆధిక్యం.. సీఎం సోనేవాల్ వెనుకంజ

అసోంలో ఎన్డీయే ఆధిక్యం.. సీఎం సోనేవాల్ వెనుకంజ

అందరూ ఊహించినట్లే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లే అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంలో దూసుకుపోతోంది. రాష్ట్రంలో మొత్తం126 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఎన్డీయే, యూపీఏ కూటముల మధ్య తీవ్ర పోటీ జరిగింది. అయితే ప్రాథమిక ఫలితాల సరళిని బట్టి ఎన్డీయే వరుసగా రెండోసారి అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉదయం 11 గంటల సమయానికి 120 స్థానాల తొలి ఫలితాలు అందుబాటులోకి రాగా.. ఎన్డీయే 77, యూపీఏ 41, ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

పుంజుకున్న యూపీఏ

ఆదివారం పోస్టల్ బ్యాలెట్లు, మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఒకేసారి మొదలుపెట్టారు. తొలుత 20-25 సీట్లతోనే బాగా వెనుకబడినట్లు కనిపించిన యూపీఏ తర్వాత కాస్త పుంజుకుంది. అయినా అధికారం సాధించాలన్న లక్ష్యానికి ఇంకా దూరంగానే ఉంది.

సీఎం వెనుకంజ

స్పష్టమైన మెజారిటీతో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టే దిశగా దూసుకుపోతున్న ఎన్డీయే కూటమికి.. ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనేవాల్ తిరోగమనంలో ఉండటం షోకిస్తోంది. మజోలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన ప్రత్యర్థి కంటే వెనుకబడ్డారు. ఈ పరిణామాన్ని బీజేపీ నాయకత్వం ముందే ఊహించిదేమో.. ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి హిమంత్ బిశ్వశర్మను ప్రాజెక్ట్ చేసింది.

Also Read : తమిళనాట పొద్దు పొడుస్తోంది.. డీఎంకే ఆధిక్యంతో స్టాలిన్ కల నెరవేరబోతోంది..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి